చంద్రబాబుకు, రామ్మోహన్‌నాయుడుకు శుభవార్త చెప్పిన నరేంద్రమోడీ
భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైనా సౌకర్యాలు అందించేందుకు కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం శబరిమలైలో కొలువుదీరిన అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు మాల వేసుకున్న భక్తులు లక్షలాదిగా తరలివెళతారు. వీరందరికీ సౌకర్యవంతంగా ఉండేందుకు, టికెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త చెప్పింది. రేణిగుంట మీదుగా శబరిమలైకి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
ఫిబ్రవరి 27 వరకు సేవలు
డిసెంబరు నాలుగో తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ వరకు 44 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య ఇవి సేవలందిస్తాయి. విశాఖపట్నం-కొల్లం మధ్య 08539 రైలు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. మార్గమధ్యంలో దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుపూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువ, ఎర్నాకులం రోడ్డు, చెంగనూరు, తిరువళ్ళ, చెంగసూర్, కాయన్ కులం స్టేషన్లలో ఆగుతుంది. అలాగే కొల్లం-విశాఖపట్నం 08540 రైలు డిసెంబరు ఐదోతేదీ నుంచి ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి తర్వాతరోజు రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో పైన పేర్కొన్న స్టేషన్లలో ఆగుతుంది. ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఈ రైలు సేవలందిస్తుంది.

జనవరి 28 వరకు సేవలు
శ్రీకాకుళం రోడ్డు- కొల్లం మధ్య నడిచే ప్రత్యేక రైలు 08553 డిసెంబరు 1వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు సేవలందిస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం 6.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే కొల్లం నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు నడిచే 08554 రైలు డిసెంబరు రెండోతేదీ నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి తర్వాతరోజు అర్థరాత్రి 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. జనవరి 28వ తేదీ వరకు సేవలందిస్తుంది. పాండూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా కొల్లం చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications