గుడ్ న్యూస్: విజయవాడ రాజమండ్రి రైల్వే సెక్షన్లో అభివృద్ధి పనులకు టెండర్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కూడా రైల్వే పనులు చేయనుంది. గోదావరీ పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఇదే సమయంలో రైల్వే కూడా రంగంలోకి దిగింది.
రూ.28.87 కోట్ల అంచనా వ్యయంతో పలు రైల్వే అభివృద్ధి పనులు
ఈ పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో, లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా, మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే రూ.28.87 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ రైల్వే సెక్షన్ లో పనులకు టెండర్లు
విజయవాడ-రాజమండ్రి రైల్వే సెక్షన్‌కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు గోదావరీ పుష్కరాల కోసం చెప్పట్టే ఈ పనుల అమలుకు టెండర్లను ఆహ్వానించారు. మార్చి 20ను టెండర్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. పుష్కరాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లు అయిన కొవ్వూరు, రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
ఈ పనులపైనే ఫోకస్ చేయనున్న రైల్వే
ముఖ్యంగా పుష్కరాల సమయంలో అవసరం అయ్యేలా ప్లాట్‌ఫారాల విస్తరణ, తాత్కాలిక షెడ్లు, క్యూలైన్ ఏర్పాట్లు వంటి చర్యలు చేపట్టనున్నారు.ఈ ప్రాజెక్టులో భాగంగా అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం, తాత్కాలిక మరియు శాశ్వత మరుగుదొడ్లు నిర్మించడం చేయనున్నారు. శుద్ధి చేసిన తాగునీటి సదుపాయాలు కల్పించడం, స్టేషన్ యార్డుల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.
పుష్కరాల కోసం రైల్వే అభివృద్ధి పనులు
రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, భద్రతా చర్యలను కూడా బలోపేతం చేయనున్నారు. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేసే అవకాశముంది.ఈ పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న క్రమంలో రైల్వే పనులకు శ్రీకారం చుడుతుంది.
2027 ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని భావిస్తున్న రైల్వే
శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టే ఈ మౌలిక వసతుల అభివృద్ధి పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పుష్కరాల సమయంలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications