దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం...23 ప్రత్యేక రైళ్లు పొడిగింపు...
ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే ఓ శుభవార్తను మోసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 23 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 23 ప్రత్యేక రైళ్ల వివరాలేంటో ఓసారి చూద్దాం. విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ (08579) వెళ్లే రైలు ప్రతి బుధవారం ఫిబ్రవరి 7నుంచి మార్చి 27 వరకు పొడిగించడం జరిగింది. ఇక, సికింద్రాబాద్-విశాఖపట్టణం (08580) రైలు ప్రతి గురువారం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు పొడిగించారు. విశాఖపట్టణం నుంచి తిరుపతి (08583) వెళ్లే రైలు ప్రతి సోమవారం ఫిబ్రవరి 5 నుంచి మార్చి 25 వరకు పొడిగించడం జరిగింది. తిరుపతి-విశాఖపట్టణం (08584) వెళ్లే రైలు ప్రతి మంగళవారం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు నడుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
విశాఖపట్నం నుంచి ఎస్ఎంవీటి (08543) రైలు బెంగుళూరు ప్రతి ఆదివారం ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు నడుస్తోంది. ఎస్‌ఎంవీటీ బెంగుళూరు నుంచి విశాఖపట్టణం (08544) వెళ్లే రైలు ప్రతి సోమవారం ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు పొడిగించినట్లు అధికారులు వివరించారు. ఇక, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్ నుంచి తిరుపతి (02809) వెళ్లే రైలు ప్రతి శనివారం నడుస్తుంది. తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్లే 02810 నెంబరు గల ట్రైన్ ప్రతి ఆదివారం ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు నడుస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా నుంచి సికింద్రాబాద్ (03253) వెళ్లే రైలు ప్రతి సోమవారం, బుధవారం నడుస్తున్నట్లు షెడ్యూల్ చేయడం జరిగింది. ఇక, హైదరాబాద్ నుంచి పాట్నా (07255) వెళ్లే రైలు ప్రతి బుధవారం ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు పొడిగించారు. సికింద్రాబాద్ నుంచి పాట్నా (07256) వెళ్లే రైలు ప్రతి శుక్రవారం ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు నడుస్తుంది.

ధనాపూర్ నుంచి సికింద్రాబాద్ (03225) వెళ్లే రైలు ప్రతి గురువారం ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు పొడిగించారు.
03226 నెంబర్‌గల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ధనాపూర్‌కు ప్రతి ఆదివారం ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 28 వరకు పొడిగించారు.
ధనాపూర్ నుంచి ఎస్‌ఎంవీటీ (03245) బెంగళూరు వెళ్లే ప్రతి ట్రైన్ బుధవారం ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 24 వరకు నడుస్తుంది.
ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి ధనాపూర్ (03246) బయలుదేరే ట్రైన్ ప్రతి శుక్రవారం ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు నడుస్తుంది.
ధనాపూర్ నుంచి ఎస్‌ఎంవీటీ (03251) బెంగళూరుకు వెళ్లే ట్రైన్ ప్రతి ఆదివారం, సోమవారం వచ్చెనెల 4 నుంచి ఏప్రిల్ 29 వరకు నడుస్తుంది.
ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి ధనాపూర్ (03252) వెళ్లే ట్రైన్ ప్రతి గురువారం, బుధవారం వచ్చె నెల 6 నుంచి మే 1 వరకు పొడిగించారు.
ధనాపూర్ నుంచి ఎస్‌ఎంవీటీ (03259) బెంగళూరు వెళ్లే ట్రైన్ ప్రతి గురువారం ఫిబ్రవరి 6 నుంచి ఏప్రిల్ 30 వరకు నడుస్తుంది.
ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి ధనాపూర్ వెళ్లే ట్రైన్ (03260) గురువారం ఫిబ్రవరి 8 నుంచి మే 2 వరకు పొడిగించారు
ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్ నుంచి ఎస్‌ఎంవీటీ (03247) బెంగళూరు వెళ్లే ట్రైన్ ప్రతి గురువారం నడుస్తుంది.
ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి ధనాపూర్ (03248) వెళ్లే ట్రైన్ ప్రతి శనివారం ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 27 వరకు నడుస్తుంది.
ధనాపూర్ నుంచి ఎస్‌ఎంవీటీ (03241) బెంగళూరుకు వెళ్లే ట్రైన్ ప్రతి శుక్రవారం ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్ 26 వరకు నడుస్తుంది.
ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి ధనాపూర్ (03242) వెళ్లే ట్రైన్ ప్రతి ఆదివారం ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు పొడిగించారు.












Click it and Unblock the Notifications