Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మచిలీపట్నం, తిరుపతికి కేంద్రం వరం

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తుంటుంది. దీనిలో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ను ప్రవేశపెట్టింది. అలాగే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తుంటుంది. తాజాగా తీర ప్రాంతమైన మచిలీపట్నం నుంచి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల తొమ్మిది, పది తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరిన అధికారులు
మచిలీపట్నంలో రైలు నెంబరు 07249 తొమ్మిదోతేదీ రాత్రి 11.00 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే రైలు నెంబరు 07250 పదోతేదీ రాత్రి తిరుపతిలో 10.50 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయానికి మచిలీపట్నం చేరుకుంటాయి. పెడన, పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది. వీటికి సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభమైంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డివిజన్ రైల్వే డివిజన్ అధికారులు సూచించారు.

south central railway running special trains from machilipatnam to tirupati

రద్దీని నియంత్రించేందుకు
విజయవాడ నుంచి గూడూరు మధ్య ప్రస్తుతం ఉన్న డబుల్ లైను రద్దీగా ఉండటంతో దీన్ని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే మూడో లైను నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేసింది. వాటి వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది. అలాగే విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా మూడోలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి గూడూరు వరకు మూడోలైను నిర్మాణం పూర్తయితే రైళ్లను మరింత వేగంగా నడపనున్నారు. కొన్ని ప్రధానమైన రైళ్లు ముందుగా పంపించేందుకు కొన్ని రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేస్తారు. ఇకనుంచి ప్రయాణికులకు అటువంటి బాధ తప్పుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+