సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్, వేళలు మార్పు..!!

వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. వినాయక చవితి.. వరుస సెలవుల వేళ ప్రయాణీకులతో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ప్రధాన రైళ్లల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. కాకినాడ, తిరుచానూరు, గుంటూరు కు ప్రత్యేక రైళ్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ పైన రైల్వే అధికారులు ప్రయాణీకులకు కీలక సమాచారం ఇచ్చారు. టైమింగ్స్ మార్పు చేసారు.

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. త్వరలోనే విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ ను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే రైల్వే బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి కొత్తగా వందేభారత్ స్లీపర్ ఖరారు పైన చర్చలు సాగుతున్నాయి. ఇక.. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ తో కొత్తగా మరిన్ని సర్వీసుల పైన వచ్చిన ప్రతిపాదనలను రైల్వే బోర్డు పరిశీలన చేస్తోంది. కాగా, ప్రస్తుతం వినాయక చవితి.. వరుస సెలవులతో రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ భారీగా పెరిగింది. వరుస గా మూడు రోజులు సెలవులు రావటంతో.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముందుస్తుగానే ప్రయాణీకు లు రిజర్వేషన్ చేయించుకున్నారు. ఇంకా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో.. పలు మార్గాల్లో అదనంగా రైళ్లను అధికారులు ప్రకటించారు.

తిరుమలలో ఈ సారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు- ఉత్సవాల మధ్య తేడాలు..ప్రత్యేకతలు..!!
తిరుమలలో ఈ సారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు- ఉత్సవాల మధ్య తేడాలు..ప్రత్యేకతలు..!!
south-central-railway-secunderabad-visakhapatnam-vande-bharat-running-3-hours-late-here-the-detai

సెలవుల వేళ ప్రధాన రైళ్లన్నీ ఫుల్

కాగా.. సికింద్రాబాద్ నుంచి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ఈ రోజు(శుక్రవారం)సెప్టెంబర్ 11, 2026 రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైలు వేళల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 20834 నెంబర్ గల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా మధ్యాహ్నం 03:00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉండగా.. ఈ రైలుకు సంబంధించిన పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్న కారణంగా.. అది సాయంత్రం 18:00 గంటలకు (6:00 PM) రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. దీంతో.. సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు సహకరించాలని కోరారు. కాగా.. ఈ రైలు ఈ మధ్య కాలంలో తరచూ ఆలస్యంగా నడుస్తుందనే ఫిర్యాదులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+