తిరుపతి, విజయవాడ, గుంటూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
దసరా పండుగ సందర్భంగా రైళ్లలో రద్దీ అంతకంతకూ పెరిగిపోతోంది. సాధారణ రైళ్లకు తోడు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నా ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు కీలక స్టేషన్ల నుంచి వన్ వే ట్రావెల్ (ఒకవైపు ప్రయాణం) కోసం తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయన్న వివరాలను అధికారులు ఇవాళ వెల్లడించారు.
దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిలో విజయవాడ నుంచి సిల్చార్ కు రేపు రైలు నంబర్ 07067ను నడుపుతున్నారు. ఇందులో సెకండ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. అలాగే రేపు తిరుపతి నుంచి దర్భంగాకు రైలు నంబర్ 07072ను నడుపుతున్నారు. ఇందులో జనరల్, స్లీపర్ బోగీలు మాత్రమే ఉంటాయి.

అలాగే అక్టోబర్ 1న సికింద్రాబాద్ నుంచి అగర్తలకు రైలు నంబర్ 07071ను నడుపుతున్నారు. ఇందులోనూ జనరల్, స్లీపర్ బోగీలే ఉంటాయి. అక్టోబర్ 1నే గుంటూరు నుంచి రంగపారా నార్త్ కు 07073 నంబర్ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఇందులో సెకండ్ ఏసీ, జనరల్, స్లీపర్ బోగీలు ఉంటాయి. చివరిగా గుంటూరు నుంచి న్యూజల్పాయ్ గురికి అక్టోబర్ 2న 0074 నంబర్ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఇందులో 2ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉంచారు. కాబట్టి వీటిని ఆయా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications