ఏపీకి మోడీ సర్కారు మరో గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి మరో భారీ శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. వాల్తేర్ డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి.. దీన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానుంది. వాల్తేర్ డివిజన్‌లోని కొత్తవలస- బచేలి, కూనేరు - తెరువలి జంక్షన్, సింగాపుర రోడ్ - కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి - గుణుపూర్ (దాదాపు 680 కిలోమీటర్లు) స్టేషన్ల పరిధిలో రాయగడ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు, విశాఖ రైల్వే డివిజన్.. పలాస- విశాఖపట్నం-దువ్వాడ, కూనేరు-విజయనగరం, నౌపాడ జంక్షన్- పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్ - సాలూరు, సింహాచలం నార్త్ - దువ్వాడ బైపాస్, వడ్లపూడి - దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ - జగ్గయ్యపాలెం (దాదాపు 410 కిలోమీటర్ల పరిధిలో) ఉండనుంది.
కాగా, శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ పలు కిలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. స్కిల్ ఇండియా కోసం రూ. 8800 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి , ఉద్యోగ శిక్షణ, సమాజ ఆధారిత అభ్యాసాన్ని అందించడం, అట్టడుగు వర్గాలతో సహా పట్టణ, గ్రామీణ జనాభా రెండింటికీ అధిక నాణ్యమైన వృత్తి విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్కిల్ ఇండియా ప్రొగ్రాంను 2026 వరకు కొనసాగించడానికి, దాని పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, పీఎం వికాస్ యోజన 4.0కి రూ. 6000 కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్‌కు రూ. 858 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications