రుతుపవనాలు వచ్చేశాయి, కానీ - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
రుతువపనాల ఆగమనం మొదలైంది. నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయి. నిర్దేశిత సమయం కంటే వేగంగా కదులుతున్నాయి. ఇంకా వేసవి పూర్తి కాకముందే రుతుపవనాల కదలికతో ఉపశమనం కలగనుంది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తొలు త ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
అండమాన్ కు రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు అధికారులు నిర్దారించారు. అంచనాలకు తగినట్లుగానే రుతుపవనాల్లో కదలిక కనిపిస్తోందని వెల్లడించారు. జూన్ 1న కేరళను తాకుతాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్స్ ఇచ్చింది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భూ ఉపరితలం నుంచి అల్పపీడనం/వాయుగుండం వైపు పొడిగాలు లు వీస్తాయని, ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈనెల 23 నుంచి ఎండ తీవ్రత పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

22న అల్పపీడనం
కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉంటుందన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే క్రమంలో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈనెల 31కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, జూన్ ఒకటినే కేరళను రుతుపవనాలు తాకుతాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది.
వాయుగుండగా మారే ఛాన్స్
పసిఫిక్ మహా సముద్రంలో బలమైన ఎల్‌నినో బలహీనపడి ఈ నెలాఖరుకు తటస్థ పరిస్థితుల్లోకి మారుతుందని, ఆగస్టు నాటికి లానినాగా బలపడుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఆ అంచనాల కంటే ఆలస్యం గా లానినా అభివృద్ధి చెందుతుందని స్కైమెట్ పేర్కొంది. తమిళనాడులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని నుంచి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల శనివారం వర్షాలు కురిశాయి. రాను న్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications