మనకు తెలియని ఎస్పీ బాలు రికార్డు: 12 గంటల్లో ఏకధాటిగా 21 పాటలు: ఎవరి కోసం?..ఏ భాషలో?
అమరావతి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కేరీర్‌లో ఎన్నో గొప్ప మైలురాళ్లను అందుకున్నారు. చెరిగిపోని చరిత్రను సృష్టించారు. ఎవరూ అందుకోవడానికి కనీసం ఊహించనూ లేని ఎత్తుకు ఎదిగారు. దశాబ్దాల కాలం పాటు తన గానమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శిశుర్వేతి.. పశుర్వేతి.. అనే సూక్తిని నిలువుటద్దంలా నిలిచారయాన. సినీ నేపథ్య గాయకుడిగా ఆయన పాడినన్ని పాటలు.. చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. దేశంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన కొన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
12 గంటల్లో ఏకధాటిగా.. 21 పాటలను రికార్డు చేశారు. అలా చేయడం ఎవరి మాత్రం సాధ్యమౌతుంది? అన్నీ వేర్వేరు పాటలు. వేర్వేరు స్వరాల్లో సాగే పాటలు. ఒకదానికొకటి పొంతన లేనివి. ఈ పాటలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నడ సినిమాల కోసం పాడారు. ఒకే మ్యూజిక్ డైరెక్టర్ దర్శకత్వంలో ఆయన 12 గంటల్లో 21 పాటలను ఆలపించారు. ఆ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్. తెలుగువాడే. బెంగళూరులో స్థిరపడ్డారు. ఒడిశాలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారాయన. అనంతరం కన్నడ చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

1981లో ఉపేంద్రకుమార్ మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రచండ పుఠాణిగళు, మహా ప్రచండరు, శ్రీమాన్ సినిమాలకు ఉపేంద్రకుమార్ సంగీత దర్శకత్వాన్ని వహించారు. ఈ మూడు సినిమాలకు అవసరమైన పాటలతో పాటు మరి కొన్నింటిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 12 గంటల్లో 21 పాటలను పాడారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకూ 21 కన్నడ పాటలు పాడి బాలు రికార్డు నెలకొల్పారు. అదో రికార్డు. ఆ తరువాత మరెవరూ ఈ ఫీట్‌ను సాధించలేకపోయారు. 12 గంటల వ్యవధిలో 21 పాటలను పాడిన తొలి, చివరి సినీ నేపథ్య గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు శాండల్‌వుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications