ఎస్పీ బాలు మొదటి గురువు ఆయన తండ్రే: కోనేటమ్మపేట నుంచి మద్రాసుకు పయనమిలా..
హైదరాబాద్/అమరావతి: సుమారు ఐదు దశాబ్దాలపాటు దక్షిణాది సంగీత ప్రపంచాన్ని ఏలిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు చిన్ననాటి నుంచే సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ. ఆ అమితాసక్తే ఆయనను సంగీత ప్రపంచంలో ఓ ధృవతారలా నిలబెట్టింది. తొలి పాట కోసం కష్టపడినా.. ఆ తర్వాత ఆయన మళ్లీ వెనుదిరిగి చూడలేదు.

బాలుకు తండ్రే మొదటి గురువు..
ఎస్పీ బాలు బాల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గడిచింది. 1946, జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు బాలు జన్మించారు. కాగా, తండ్రి సాంబమూర్తి హరకథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శించేవారు. తండ్రి కారణంగా బాలుకు కూడా సంగీతంపై మక్కువ కలిగింది. దీంతో బాలుకు తన తండ్రి సాంబమూర్తే తొలి గురువయ్యారు. ఇలా ఐదేళ్ల వయస్సులోనే తండ్రితో కలిసి ‘భక్త రామదాసు' నాటకంలో నటించారు.

చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండే బాలు..
నగరిలోని మేనమా శ్రీనివాసరావు ఇంట్లో ఉంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు బాలు. ఇక ఆ తర్వాత ప్రాథమికోన్నత విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో పూర్తి పూర్తి చేశారు. కాగా, చదువులోనూ, ఆటల్లోనూ బాలు ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండేవారు. బాలు గొంతు బాగుండటంతో పాటలు పాడించేవారు ఉపాధ్యాయులు. ఇలా జీవీ సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయులు బాలుతో చెంచులక్ష్మి సినిమాలో సుశీల ఆలపించిన ‘పాలకడలిపై శేషతల్పమున' అనే పాటను పాడించి టేప్ రికార్డర్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత పలు నాటకాల్లోనూ వేశాలు వేశారు బాలు.

మద్రాసుకు పయనం.. మొదటి అవకాశం నటనలోనే..
తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివారు. ఈ సమయంలో మద్రాసు ఆలియాండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయవాడ ఆకాశవాణిలో బాలు స్వయంగా రాసి, బాణీకట్టి పాడిన ఒక లలిత గీతానికి బహుబమతి కూడా గెలుచుకున్నారు. అనంతరం మద్రాసులో ఏఎంఐఈలో చేరి చదువును కొనసాగిస్తూనే.. సినిమాల్లో పాటలు పాడే అవకాశం కోసం ప్రయత్నించారు. మొదటి ఆయనకు వెండితెరలో నటించేందుకు అవకాశం వచ్చింది. అలా ఆయన నటుడిగానూ మారారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు కోదండపాణి తొలి అవకాశం ఇవ్వడంతో పూర్తిస్థాయి గాయకుడిగా మారిపోయారు బాల సుబ్రహ్మణ్యం. అలాగే. సినిమాల్లోనూ నటించడం కొనసాగించారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications