కోరిక తీర్చు: గుంటూరు ఎస్పీ ఆఫీసులో మహిళపై లైంగిక వేధింపులు
గుంటూరు: జిల్లాలోని ఎస్పీ ఛాంబర్‌కు అతి సమీపంలో ఉండే కార్యాలయంలోనే ఓ జూనియర్ అసిస్టెంట్ లైంగిక వేధింపులకు గురైంది. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం నగరంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని పైఅంతస్తులో పరిపాలన విభాగంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మాధవి గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కానిస్టేబుల్‌గా పని చేసే ఆమె తండ్రి సాంబయ్య చనిపోవడంతో ఆమెకు పోలీసు కార్యాలయంలో మినిస్టీరియల్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధించి హెచ్‌ఆర్‌ఏ బిల్లులను ఆమె చూస్తూ ఉంటారు. బీ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేసే కరీముల్లా తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధింపులకు గురిచేశాడు.
తన లైంగిక వేధింపులకు లొంగకపోవడంతో ఆమెపై వేధింపులు మరితంగా పెంచాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు నేరుగా గత సోమవారం అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేసింది. వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న ఫోన్ రికార్డ్స్, సీడీలను సైతం అర్బన్ ఎస్పీకి అందించింది. దీంతో ఈ వ్యవహారంపై అర్బన్ ఎస్పీ విచారణకు ఆదేశించారు.

గత నాలుగు నెలలుగా బాధితురాలి పట్ల ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. ఎస్పీకి ఫిర్యాదు తర్వాత బాధితురాలిపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, మాధవిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ సెక్షన్ సూపరింటెండెంట్ కరీముల్లాను బదిలీ చేస్తామని బాధితురాలి భర్తకు పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications