ఆర్కే రాజీనామాపై స్పందించిన స్పీకర్ తమ్మినేని: ఆమోదంపై కామెంట్స్
Alla Rama Krishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియెజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తన పదవితో పాటు పార్టీకీ గుడ్‌బై చెప్పారాయన. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
మంగళగిరి ఇన్‌ఛార్జీగా గంజి చిరంజీవిని అపాయింట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పద్మాశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అనంతరం గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. మంగళగిరి ఇన్‌ఛార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించడం లాంఛనమే కావొచ్చు.

కాగా- ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామా పత్రం తనకు ఇంకా అందలేదని చెప్పారు. తన ఓఎస్డీ ఈ సమాచారాన్ని తనకు తెలియజేశారని అన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారనే విషయంపై తనకూ స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.
రాజీనామాకు గల కారణాలను పూర్తిగా తెలుసుకున్న తరువాతే దానిపై మాట్లాడగలుగుతానని తమ్మినేని పేర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. రాజీనామా ఇచ్చినంత మాత్రాన అది దాన్ని ఆమోదించలేం అని తేల్చి చెప్పారు.
రాజీనామా పత్రం రాజ్యాంగబద్దంగా ఉందో లేదో చూసేంతవరకు స్పష్టత ఇవ్వలేమని తమ్మినేని అన్నారు. ఆర్కేకు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ సముచిత స్థానం ఇవ్వకపోవడం వల్లే ఆయన రాజీనామా చేశారనడంలో అర్థం లేదని కొట్టిపారేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేశారని తెలిసిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications