ఏపీలో కాలుష్య కాసారం: ప్రత్యేక కార్పొరేషన్‌తోనే చెక్, మూడేళ్లలో ఫలితాలు, అధికారులతో సీఎం జగన్..

కాలుష్య నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించింది. సముద్ర, నది, కాలువ, జలశయాలు కాలుష్యానికి గురవుతున్న నేపథ్యంలో నియంత్రణపై చర్యలకు ఉపక్రమించింది. కాలుష్య నియంత్రణ కోసం ఏ విధానాలు అవలంభించాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కాలుష్య నియంత్ర విభాగం అధికారులు సమావేశమయ్యారు. కాలుష్య నియంత్రణ కోసం ఏర్పాటు చేసే కార్పొరేషన్ విధివిధానాలను సీఎం జగన్‌కు వివరించారు.

 సేమ్ టు సేమ్

సేమ్ టు సేమ్

అభివృద్ధి చెందిన దేశాల్లో జల, వాయు, వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం అనుసరిస్తోన్న విధానాలను రాష్ట్రంలో కూడా అనుసరించాలని జగన్ అధికారులకు స్పష్టంచేశారు. కొత్తగా ఏర్పడే ప్రత్యేక కార్పొరేషన్ అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు, ఆస్పత్రులు, కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో జరుగుతోన్న నష్టంపై ఫోకస్ చేయాలని.. ఇందుకోసం ఎలాంటి విధానాలు అవలంభించాలనే అంశంపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు.

కంపెనీల్లో బోర్డులు

కంపెనీల్లో బోర్డులు

ఏ ఏ సంస్థలు ఎలాంటి ప్రమాణాలు పాటించాలనే అంశంపై పరిశ్రమలు, సంస్థలలో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. విజిల్ బ్లోయర్ వ్యవస్థను ప్రోత్సహించడంతో కాలుష్యాన్ని నివారించొచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు కాలుష్యానికి సంబంధించి ఎవరైనా సమాచారం ఇస్తే వారికి బహుమతులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివరాలు అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు. దీంతో కాలుష్య నియంత్రణకు సరైన అడుగులు పడతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Recommended Video

    AP Cabinet Employees Are On Duty @ New Capital Visakhapatnam
     టార్గెట్ @ 3 ఈయర్స్

    టార్గెట్ @ 3 ఈయర్స్

    పట్టణాల్లోనే కాలుష్యం ఎక్కవగా ఉంటుంది. ఇక్కడ పొల్యూషన్ తగ్గిస్తే.. సమస్య తగ్గినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాల్లో కాలుష్య నివారణపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాలని జగన్ సూచించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పడినప్పటీ నుంచి మూడేళ్లలో మంచి ఫలితాలు కనిపించాలన్నారు. దీంతో కొత్త కార్పొరేషన్ కు మంచి పేరు వస్తోందన్నారు. అయితే ప్రత్యేక కార్పొరేషన్‌లో అవినీతికి తావులేదని... అవినీతిని ఏ స్థాయిలో కూడా ఉపేక్షించబోమని జగన్ తేల్చిచెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+