'హోదా'పై బీజేపీ కొత్త వ్యూహం: మరింత చిక్కు, బాబును గట్టెక్కిస్తున్న మోడీ

న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా పైన ఈ నెల 13వ తేదీన రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన బిల్లు పైన చర్చ, ఓటింగ్ జరగనుంది. అయితే, దీనిపై చర్చ జరిగితే ఎన్డీయే ప్రభుత్వం, ప్రధానంగా బీజేపీ ఇరుకున పడనుంది.

ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన ఎన్డీయే వ్యూహాత్మక వైఖరి అవలంభించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అంతకుముందే రాజ్యసభను నిరవధిక వాయిదా వేసేందుకు ప్రణాళిక వేసుకుందని తెలుస్తోంది.

రాజ్యసభలో బలం లేక ఆత్మరక్షణలో ఎన్డీయే

కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రయివేటు బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై ఈ నెల 13వ తేదీన ఓటింగ్ కూడా జరగాల్సి ఉంది. ఇటీవలే దీనిపై చర్చ జరిగింది. 13న ఓటింగ్ జరగాల్సి ఉంది. కానీ, రాజ్యసభలో బీజేపీకి లేదా ఎన్డీయేకు సరైన బలం లేదు.

ప్రత్యేక హోదాపై ప్రయివేటు బిల్లుకు అందరూ మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు లైన్ల వ్యాఖ్యతో విప్ జారీ చేసింది. విపక్షాలు కూడా కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు పలికేందుకు సిద్ధమయ్యాయి.

దీంతో, రాజ్యసభలో బలం లేని ఎన్డీయే కచ్చితంగా ఇరుకున పడే అవకాశముంది. ఆత్మరక్షణలో పడిన ఎన్డీయే రాజ్యసభను రేపు (గురువారం) అంటే 12వ తేదీనే నిరవధిక వాయిదా వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. తద్వారా తప్పించుకో చూస్తుందని అంటున్నారు.

Special status: PM Modi may bail out CM Chandrababu

చంద్రబాబుకు ఊరట

కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. బీజేపీకి మద్దతు ఇస్తుందా లేక కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి మద్దతిస్తుందా అనే చర్చ జరిగింది. అయితే, రాజ్యసభ నిరవధిక వాయిదా పడితే చంద్రబాబుకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు.

ప్రత్యేక హోదా విషయంలో కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుకు టిడిపి మద్దతు పలకకుంటే.. ఏపీ ప్రజల ముందును చంద్రబాబును కాంగ్రెస్, వైసిపిలు దోషిగా నిలబెట్టేవు. మరోవైపు, ఏపీకి కేంద్రం అవసరం కాబట్టి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితి.

దీంతో, చంద్రబాబు ఇరుకున పడేవారు. కానీ రాజ్యసభ నిరవధిక వాయిదా పడితే మాత్రం చంద్రబాబును మోడీ ఆపద నుంచి గట్టెక్కించినట్లే అవుతుందంటున్నారు. అయితే, నిరవధిక వాయిదా వేయడం వల్ల బీజేపీ పైన ఏపీలో విమర్శలు వెల్లువెత్తనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+