'పవన్ కళ్యాణ్‌కు హోదా తెచ్చే శక్తిలేదు, రాహుల్ గాంధీ వచ్చాకే'

అనంతపురం: జనసేన పార్టీకి ప్రత్యేక హోదా తెచ్చే శక్తి లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి శుక్రవారం నాడు అనంతపురం జిల్లాలో అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎలాగు ప్రత్యేక హోదా ఇవ్వదని తేల్చి చెప్పారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక, కాంగ్రెస్ పార్టీ ఏపీకి హోదా ఇస్తుందని చెప్పారు.

రఘువీరా మాటల మాంత్రికుడు: పల్లె

ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాటల మాంత్రికుడు అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు విజయవాడలో అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతోందని చెప్పారు. ఆయన ప్రజలను ఎంత మభ్యపెట్టాలని చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు లేవని చెప్పారు.

ఓటుకు నోటులో స్టేపై యనమల హర్షం

ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించడం పైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఇది సంతోషమన్నారు. వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదని అందువల్లే స్టే వచ్చిందని చెప్పారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పైన క్షమాపణ చెబుతూ రోజా రాసిన లేఖపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామన్నారు.

'Special Status will not come with Pawan Kalyan'

రంగంలోకి దిగిన జనసేన

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సెప్టెంబర్ 9వ తేదీ నుంచి కాకినాడ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఉద్యమం ప్రారంభించనున్నారు. 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ చెప్పిన కాకినాడలోనే ఆయన ఈ సభను ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముందుగానే ఉద్యమం ప్రారంభించింది. అనంతపురం, కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ ప్రత్యేక హోదా కోసం నిరసన వ్యక్తం చేస్తోంది. తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+