పచ్చని Araku పిలుస్తోంది బాస్: ప్రత్యేక రైళ్లు కూడా.. రూట్ ఇదే!!

Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ రద్దీని నివారించడానికి తూర్పు కోస్తా రైల్వే (ECoR) ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. అరకు-యలహంక, శ్రీకాకుళం రోడ్డు- బెంగళూరు కంటోన్మెంట్, భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి వివరాలిలా ఉన్నాయి.

Special trains will be operated from Araku to Yelahanka
  • ఈ నెల 13, 23 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకు నుంచి బయలుదేరే నంబర్ 08551 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10.15 నిమిషాలకు యలహంక చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో ఈ నెల 14, 24 తేదీల్లో మధ్యాహ్నం 1:30 గంటలకు యలహంక నుంచి బయలుదేరే నంబర్ 08552 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది.
  • ఈ నెల 17, 24 తేదీల్లో మరో ఎక్స్ ప్రెస్ ఇదే రూట్ లో రాకపోకలు సాగించనుంది. వీటి నంబర్లు వేరు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకు నుంచి బయలుదేరే నంబర్ 08555 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10.15 నిమిషాలకు యలహంక చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో ఈ నెల 18, 25 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలకు యలహంక నుంచి బయలుదేరే నంబర్ 08556 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది.
  • బుర్రా గుహలు, శృంగవరపుకోట, కొత్తవలస, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+