సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ టిఎన్ పిళ్లై మృతి: కెసిఆర్ దిగ్ర్భాంతి(ఫొటోలు)

హైదరాబాద్: సీనియర్ క్రీడా పాత్రికేయులు టిఎన్ పిళ్లై మృతి చెందారు. 85 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా తమకు సేవలు అందించిన పిళ్లై మృతికి క్రీడా సంఘాలు, సమాఖ్యలు సంతాపం వ్యక్తం చేశాయి. డక్కన్ క్రానికల్ దినపత్రికలో సుమారు నాలుగు దశాబ్దాలు పని చేసిన పిళ్లై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధికి విశేషంగా శ్రమించారు.

Sports journalist TN Pillai passes away

ఆంధ్రప్రదేశ్ మహిళా క్రీడా సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. స్థానిక క్రీడలకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న సూత్రాన్ని చాలా పత్రికలు ఇప్పటికీ అనుసరిస్తున్నాయి. ఫొటోగ్రఫీలో మంచి ప్రవేశం ఉన్న ఆయన బహుముఖ ప్రజ్ఞతో క్రీడా జర్నలిజానికి విశేష సేవలు అందించారు.

Sports journalist TN Pillai passes away

పిళ్లై మృతిని తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రస్తావించారు. పలువురు మాజీ, ప్రస్తుత క్రీడాకారులు కూడా పిళ్లై మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+