ప్రేయసి ఇంటి ముందు అతను గొంతు కోసుకున్నాడు

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గల ఛత్రినాక లక్ష్మినగర్‌కు చెందిన యువతి (22), గోపాల్ (26) గత ఐదేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో వీరిని స్థానికులు ప్రేమికులుగా భావించారు. తనను పెళ్లి చేసుకోవాలని గోపాల్ ఆ యువతిని పలుమార్లు కోరాడు.
పెళ్లికి యువతి నిరాకరించినా అతను పట్టు వీడలేదు. దాంతో అతని ఆమె ఇంటి ముందు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దాన్ని గమనించిన స్థానికులు 108 సాయంతో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గాయం చిన్నది కావడంతో ఉస్మానియా వైద్యులు అతడికి చికిత్స చేసి ఇంటికి పంపివేశారు. అయితే, ఆత్మహత్యాయత్నం కింద గోపాల్‌పై కేసు నమోదు చేస్తామని ఛత్రినాక పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన ఆదివారంనాడు చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications