హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హక్కుల నేత ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ (89) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్‌గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ఎంటి ఖాన్ అంత్యక్రియలు జరిగాయి.

ఖాన్ యువకుడిగా ఉన్నప్పుడు రాజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కోట్ల అలిజా ధర్మవంత్ విద్యా సంస్థలో కొంత కాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత సియాసత్, ఈనాడు గ్రూప్‌నకు చెందిన న్యూస్ టైమ్ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు.

తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్, విరసం నేత వరవరరావు తదితరులు ఖాన్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఖాన్ పాతనగరంలో వికసించిన ఎర్రమోదు అని ప్రముఖ పరిశోధకుడు జయధీర్ తిరుమల రావు అన్నారు.

జీవిత చరిత్ర రాస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయారని, ఖాన్ లేని లోటును తీర్చడం ఎవరి వల్లా కాదని ఆయన ఓ ప్రకటనలో అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రగతిశీల మార్గంలో పోరాడిన యోధుడు ఎంటి ఖాన్ అని మానవ హక్కుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శలులు జీవన్ కుమార్, విఎస్ కృష్ణ అన్నారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

హైదరాబాద్‌లో గుండెపోటు కారణంగా మరణించిన ప్రముఖ పౌర హక్కుల సంఘం నేత ఎంటి ఖాన్‌కు బుధవారం సాయంత్రం తుది విడ్కోలు పలికారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ప్రముఖ పౌర హక్కుల నేత ఎంటి ఖాన్‌కు ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ కవి వరవర రావు బుధవారంనాడు నివాళ్లు అర్పించారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ప్రముఖ పౌరహక్కుల నేత, రచయిత ఎంటి ఖాన్‌కు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బి. నర్సింగరావు, తదితరులు నివాళులు అర్పించారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తెలంగాణ ఉద్యమ నేత కేశవ రావు జాదవ్ తదితరులు బుధవారంనాడు నివాళులు అర్పించారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్ జ్ఞాపకార్థం ఆయనకు తుది వీడ్కోలు పలుకుతూ బూర్గుల ఇలా కనిపించారు. ఎంటి ఖాన్ అనారోగ్యంతో మరణించారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ప్రముఖ రచయిత, జర్నలిస్టు ఎంటి ఖాన్‌కు ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ తదితరులు నివాళులు అర్పించారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ప్రముఖ పౌరహక్కుల సంఘం నేత ఎంటి ఖాన్‌కు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ నివాళులు అర్పించారు.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ప్రముఖ పౌర హక్కుల నేత ఎంటి ఖాన్ అంతిమ యాత్ర హైదరాబాదులోని పాతబస్తీలో ఇలా సాగింది.

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు

ప్రముఖ పౌర హక్కుల నేత ఎంటి ఖాన్ అంతిమ యాత్రలో ఇలా ముస్లిం సోదురులు... ఖాన్ మృతదేహానికి బుధవారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి.

English summary
Civil liberties leader, journailst and a writer MT Khan passed away. His last ritual has been done in old city of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X