ఎల్లుండి నుంచి తిరుపతి కపిలతీర్థం ఆలయంలో.. !!

తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను కనులపండువగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వార్షిక దేవీ నవరాత్రులను పురస్కరించుకుని బుధవారం ఉదయం దేవాలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుక నిర్వహించారు. ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో కపిలేశ్వరస్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అర్చనలు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గర్భాలయం, ఉప ఆలయాలు, ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణ పరిసరాలన్నింటినీ నీటితో శుభ్రం చేశారు. పసుపు, కుంకుమ, కర్పూరం సహా పలు సుగంధ ద్రవ్యాల లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేశారు.

Sri Kamakshi Ammavari Navaratri Utsavams to be held from October 11 to 20 at Kapila theertham temple

దసరా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోన్నారు. ప్రారంభ రోజైన అక్టోబరు 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవ కలశ స్థాపన, వాస్తు పూజ లాంటి ఆగమ పూజలను శాస్త్రోక్తంగా జరపనున్నారు. ఉత్సవాలు జరిగే మొత్తం 10 రోజుల పాటు నిత్యం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

తమిళ వలస కుటుంబానికి చెందిన నవనీతం పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి
తమిళ వలస కుటుంబానికి చెందిన నవనీతం పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి

11న శ్రీ కామాక్షి దేవి అలంకారంలో కటాక్షిస్తారు అమ్మవారు. 12న మావడి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. 13న శ్రీ ఆదిపరాశక్తి అలంకారంలో దర్శనం ఇస్తారు. 14న శ్రీ గాయత్రి దేవి, 15న శ్రీ తపః కామాక్షి అలంకారం, 16న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 17న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు కరుణిస్తారు. 18న శ్రీ మహిషాసురమర్థిని, 19న శ్రీ సరస్వతి దేవి అలంకారంలో అశేష భక్తజనావళిని దీవిస్తారు. చివరి రోజైన 20వ తేదీ నాడు శ్రీ శివపార్వతుల అలంకారంలో కటాక్షిస్తారు.

9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్
9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్

నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన అక్టోబరు 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు భక్తుల కోసం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి సంగీత కచేరీలు, దేవి భాగవతంపై ఆధ్యాత్మిక పురాణ ప్రవచనాలు, లలితా సహస్రనామ పారాయణం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+