తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో గోవిందుడు !
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి (Sri Malayappa) కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
కల్పవృక్ష వాహనం..... ఐహిక ఫల ప్రాప్తి:క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు (Kalpavriksha) తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని( Kalpavriksha vehicle) అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ (tirumala) వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, జేఈవో శ్రీమతి సదా భార్గవి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమల (tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam)భాగంగా తిరుమలలో (tirumala) శ్రీవారి భక్తుల సంఖ్య మెస్తారుగా ఉంది. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి ఏడుకొండల మీదకు వెలుతున్న భక్తల సంఖ్య కొంచెం పెరిగింది. మంగళవారం 72, 123 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, మంగళవారం కల్యాణకట్టలో 26, 054 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.













Click it and Unblock the Notifications