Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'పవన్! మా బాస్ జగన్‌ను అంటావా, ఒళ్లుదగ్గర పెట్టుకో, చిరంజీవి వాడుకొని'

Recommended Video

    పవన్! మా బాస్ జగన్‌ను అంటావా, ఒళ్లుదగ్గర పెట్టుకో : శ్రీరెడ్డి

    హైదరాబాద్/అమరావతి: శ్రీరెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బాస్ అని చెప్పారు. జనసేనాని ఇటీవల మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు సొంతగా పార్టీ పెట్టలేదని, జగన్‌లా తన తండ్రి మాజీ సీఎం కాదని విమర్శలు గుప్పించారని, చెబుతూ వాటికి కౌంటర్ ఇచ్చారు. పాలిటిక్స్ చాలా వాడివేడిగా నడుస్తున్నాయని, మై స్వీట్.. స్వీట్ పర్సన్ పవన్ అని ఎద్దేవా చేశారు.

    'పవన్ గారు.. హై హౌ ఆర్యూ.. మీరు నన్ను మర్చిపోలేదనుకుంటా. నేను కూడా మీమ్మల్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను చాలా సీరియస్‌గా తీసుకొని కొన్ని వేలమంది అమ్మాయిల సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో కొంచెం త్యాగం చేసి ప్రారంభించిన ఉద్యమాన్ని చల్లారగొట్టారు. అందుకే లైఫ్‌లో మిమ్మల్ని ఎప్పుడూ మరిచిపోలేను.' అని ప్రారంభించారు.

    పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నచ్చలేదు

    పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నచ్చలేదు

    ఈ మధ్య పవన్ చేసిన కామెంట్స్ తనకు నచ్చలేదని శ్రీరెడ్డి అన్నారు. మా చంద్రబాబును, నా ఫేవరేట్ జగన్ సార్‌ను.. జగన్ నా బాస్.. అతను అందుకు అర్హులే.. అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి చంద్రబాబు దూరారని చెప్పారని, కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక జగన్ సొంతగా పార్టీ పెట్టారన్నారు.

     హఠాత్తుగా సిద్ధాంతాలు గుర్తుకు వచ్చాయా?

    హఠాత్తుగా సిద్ధాంతాలు గుర్తుకు వచ్చాయా?

    వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే భవిష్యత్తులో ప్రధానమంత్రి అయి ఉండేవారని, మా కళ్లకు అదృష్టం లేక ఆయనను దూరం చేసుకున్నామని శ్రీరెడ్డి అన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. జనసేన సొంతగా పెట్టుకున్న పార్టీ అని చెప్పారని, మాకు సిద్ధాంతాలు మాత్రమే ఉన్నాయని, డబ్బులు మాత్రం లేవని చెప్పారని గుర్తు చేశారు. కానీ మీకు హఠాత్తుగా సిద్ధాంతాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు.

    ముఖ్యమంత్రి కావాలనే వచ్చారు

    ముఖ్యమంత్రి కావాలనే వచ్చారు

    జనసేన పెట్టి ఎన్నేళ్లవుతోందని శ్రీరెడ్డి ప్రశ్నించారు. ఇన్నేళ్లలో జనసేనకు సిద్ధాంతాలు ఏ రోజు గుర్తుకు రాలేదా అన్నారు. ఉద్ధానం సమస్య సహా అన్నీ హఠాత్తుగా గుర్తుకు వచ్చాయా అన్నారు. మీరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు రాజకీయ పార్టీలు తప్పులతడకలా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

    అప్పుడు మీకు కనిపించలేదా

    అప్పుడు మీకు కనిపించలేదా

    ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీ అన్నయ్య తరఫున డప్పు కొట్టేందుకు (ప్రచారం) చేసేందుకు వచ్చారని, అప్పుడు మీకు ఉద్ధానం సమస్యలు, శ్రీకాకుళంలోని మారుమూల గ్రామాల సమస్యలు గానీ, విద్యార్థులు, నిరుద్యోగులు, జాలర్ల సమస్యలు అప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఈ సమస్యలు వచ్చాయా అని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో ఎప్పుడు లేని పర్యటనలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని, ఇలా పర్యటనలు చేసినంత మాత్రాన సీఎం అవుతామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జనాలకు ఆ మాత్రం లాజిక్ లేదా అన్నారు. మీరు ఓటు వేయమన్న వారికి వేసేందుకు జనాలు ఎర్రిపప్పల్లాగా కనిపిస్తున్నారా అన్నారు.

     ప్రజారాజ్యంను ఎందుకు కొనసాగించలేదు?

    ప్రజారాజ్యంను ఎందుకు కొనసాగించలేదు?

    మీరు సొంతగా దిగితే మీకు ఓటేయాలని, లేదా మీరు చూపించిన వారికి ఓటు వేయాలా.. జనాలు వెర్రిపప్పలా అని శ్రీరెడ్డి మండిపడ్డారు. టీడీపీ మీకు ఎలా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. మీరు చెబుతున్న సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం నుంచి మద్యపానం నిషేధం వరకు ఎన్నో ఉన్నాయని, సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. చంద్రబాబును దొంగదారిన వచ్చారని చెబుతున్నారని, మరి ప్రజారాజ్యంను ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు.

     ఎంతకు.. అంటూ సారీ.. చిరంజీవి వాడుకొని..

    ఎంతకు.. అంటూ సారీ.. చిరంజీవి వాడుకొని..

    ఈ సమయంలో ఆమె మీరు ఎంతకు.. మీరు ఎంతకు అంటూ.. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు శ్రీరెడ్డి. ఎందుకు అనబోయి ఎంతకు అన్నానని చెప్పారు. మీరు కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేశారని ప్రశ్నించారు. పీఆర్పీని మీ అన్నయ్య పార్టీ అని, దానిని మీరు (పవన్) ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు. టీడీపీ.. టీడీపీ అంటూ వారసులు అంటూ ఏడుస్తున్నారని, మరి పీఆర్పీకి వచ్చిన నిధులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు తీసుకొని, వాటిని వాడుకొని, ఇప్పుడు కాంగ్రెస్‌ను ముంచి, ఆయన (చిరంజీవి) తన ఫ్యాన్స్‌ను నీదాంట్లోకి (జనసేన) పంపిస్తున్నారని శ్రీరెడ్డి విమర్శించారు. ఆయన మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారన్నారు. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతోందా పవన్ గారు.. జనాలను ఇలా పిచ్చోళ్లను ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

    మీ తిక్క తెలిసింది, ది గ్రేట్ చంద్రబాబు

    మీ తిక్క తెలిసింది, ది గ్రేట్ చంద్రబాబు

    తిక్క.. (నాక్కొద్దిగా తిక్క అనే డైలాగ్) ఉందని మీరు ప్రతిసారి చెబుతుంటారని, కానీ ఇంత తిక్కగా ఉందని నాకు మీ మాటలు చూస్తున్న తర్వాత తెలిసిందని శ్రీరెడ్డి అన్నారు. టీడీపీ దొడ్డిదారిన అంటున్నారని, కానీ అలా మాట్లాడవద్దన్నారు. టీడీపీ పార్టీని ఏ రేంజ్‌లోకి తీసుకువచ్చి, ఆ పార్టీ సిద్ధాంతాలతో ఒంటిచేత్తో నడుపుతున్న వ్యక్తి ది గ్రేట్ చంద్రబాబు గారు అన్నారు. ఎంత తెలివిగా, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన బాగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. టీడీపీ చేసినన్ని మంచి కార్యక్రమాలు.. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎన్నో ఉన్నాయన్నారు. కానీ పీఆర్పీలో ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగాయో, జనసేన వస్తే ఏం చేస్తుందనేది ఈ రోజుకు క్లారిటీ లేదన్నారు. పీఆర్పీలో జరిగిన మంచి వెతికినా దొరగడం లేదన్నారు.

     మా బాస్‌ను అనేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిక

    మా బాస్‌ను అనేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిక

    జగన్ వద్ద ఉన్నట్లుగా తన వద్ద కోట్ల రూపాయలు లేవని చెప్పడం దారుణంగా ఉందని శ్రీరెడ్డి అన్నారు. మా బాస్‌ను అలా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మీ అరవింద్ వద్ద ఎన్ని వందల కోట్లు ఉన్నాయో, మీ అన్నయ్య వద్ద ఎన్ని వందల కోట్లు ఉన్నాయో, చరణ్ వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో, మీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో ఓసారి లెక్క చూడాలన్నారు. ఆ లెక్కలు తెప్పించాలన్నారు. మీరు లేనోళ్లమని, కానిస్టేబుల్ బిడ్డనని చెప్పి.. జనాల్లో సెంటిమెంట్‌తో గెలుద్దామని చూస్తున్నారని, కానీ ఇది జరగదన్నారు. చంద్రబాబు, జగన్ పేరెత్తడానికి మీకు అర్హత లేదన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+