సాయంత్రం తెరచుకోనున్న శ్రీశైలం గేట్లు..! గరిష్ట స్థాయికి రిజర్వాయర్ నీళ్లు...!!
శ్రీశైలం/హైదరాబాద్ : శ్రీశైలం రిజర్వాయర్ లో వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 879.30 అడుగులకు చేరింది. దీంతో సాయంత్రం 5 గంటలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మూడు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 3,59,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుత నీటి నిల్వ 184.27 టీఎంసీలుగా నమోదైంది.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1351 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు 735 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. మరోవైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.

ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలుకాగా..ప్రస్తుతం 88.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 3,49,526 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంత కంటే ఎక్కువగా 3,64,052 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ..ప్రస్తుతం 20.04 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. నారాయణపూర్ జలాశయానికి 4,02,951 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..మొత్తం 4,18,637 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 6.05 టీఎంసీలుగా ఉంది.
జూరాలకు ఇన్ ఫ్లో 3,69,484 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,74,600 క్యూసెక్కులగా నమోదైంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా..ప్రస్తుతం నీటి నిల్వ 60.72 టీఎంసీలుగా ఉంది. తుంగభద్రకు ఇన్ ఫ్లో 1,42,114 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,089 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 142.08 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 64,136 క్యూసెక్కులు వస్తుండగా, 9,271 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications