Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టి పరిస్థితుల్లోను ఆమె గెలవకూడదు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణాన హోరాహోరీగా పోరాడేందుకు తలపడేందుకు అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాలో వైసీపీ ఉండగా, జనసేన, బీజేపీతో కలిసి తామే అధికారంలోకి వస్తామనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడితే కూటమి మధ్య, వైసీపీ మధ్య కురుక్షేత్ర సంగ్రామమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పలాస. ఇక్కడి నుంచి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌతు శిరీషపై16,247 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ 17,525 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వజ్జా బాబూరావుమీద ఘన విజయం సాధించారు.

srikakulam district palasa assembly constituency details

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో పలాస నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో టీడీపీ, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు మధ్య, గౌతు శిరీష మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అప్పలరాజును ఓడిస్తామని శిరీష చెబుతుండగా, రెండోసారి కూడా తానే విజయం సాధిస్తానని అప్పలరాజు అంటున్నారు. విడతలవారీగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటించుకుంటూ వస్తోన్న వైసీపీ ఈసారి ఎన్నికలకు కూడా అప్పలరాజుకే టికెట్ కేటాయిస్తుందా? లేదంటే వేరేవారికి ఇస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. మూడు పార్టీల బలంతో తామే గెలుపొందుతామని ఆపార్టీ ఆత్మవిశ్వాసంతో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+