మా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు గెలవలేదు- సొంత పార్టీ నేత వారసుడి సంచలనం..!!

ఏపీలో రాజకీయం వేగంగా మారుతోంది. స్థానిక ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ఇదే సమయంలో విజయనగరం లో మజ్జి శ్రీను వైసీపీ వీడిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసు కొంటున్న వేళ... తాజాగా శ్రీకాకుళం వైసీపీలో రచ్చ మొదలైంది. కీలక నేత కుమారుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఉత్తరాంధ్ర వైసీపీలో కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. విజయనగరంలో మజ్జి శ్రీను తన కుమార్తెతో సహా పార్టీ వీడి టీడీపీలో చేరారు. మరి కొందరు నేతలు అదే బాట పడుతున్నారని పార్టీ లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో శ్రీకాకుళం వైసీపీలో కొత్త రచ్చ మొదలైంది. జిల్లాలోని సొంత పార్టీ నేతలే టార్గెట్ గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమ్మినేని సీతారం కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srikakulam YSRCP leader Tammineni sitaram son comments against own party leads to new controversy

తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. తమ్మినేనిపై మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా పార్టీ అధ్యక్షులు కనీసం ఖండించకపోవడం అమానుషమని పేర్కొన్నారు. తమ్మినేని, కూన రవికుమార్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందంటూ వైసీపీ నేతలే వ్యాఖ్యలు చేయటం ఏంటని నాగ్ నిలదీసారు.

 కొత్త పెన్షన్ దరఖాస్తు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ముహూర్తం..!!
కొత్త పెన్షన్ దరఖాస్తు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ముహూర్తం..!!

ఉత్తరాంధ్ర పరిణామాల పై జగన్ ఫోకస్

దీనికి కొనసాగింపుగా.. ఈ అంశంపై వైసీపి జిల్లా కీలక నేతలు ధర్మాన సోదరులు, కుంభ రవిబాబు, భూడి ముత్యాల నాయుడు మాట్లాడక పోవడం దారుణమని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని వ్యాఖ్యానించారు. సీతారాం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వివక్షత లేదని అన్నారు. జిల్లాలో ఓకే కులం కోసం పార్టీ ముందు కు పోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. చింతాడ రవి వైసీపీ ఆమదాల వలస అభ్యర్థిగా ఉంటాడో లేదోనని నేతల్లో అభద్రత ఉందని పేర్కొన్నారు.

వైసీపీ పార్టీ అధిష్ఠానం జిల్లా నాయకత్వ తీరుపై సర్వే చేయాలని చిరంజీవి నాగ్ కోరారు. కాగా.. ఈ వ్యవహారం పైన ప్రాంతీయ సమన్వయకర్త బొత్సా నుంచి జగన్ నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ రోజున జగన్ తో బొత్సా భేటీ కానున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. తీసుకోవాల్సి న చర్యల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+