• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వివాహితతో ఎఫైర్: ఆటోలో ప్రయాణం ఎఫైర్ వరకు, నమ్మించి హత్య, ఎందుకంటే?

By Narsimha
|

విశాఖపట్టణం: వివాహేతర సంబంధం కారణంగా హత్యకు గురైన ఓ మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ప్రియడే అనుమానంతో వివాహితను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలోని అప్పన్నదొరపాలెంలో చోటు చేసుకొంది ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ 13వ తేదిన నర్సీపట్నం సమీపంలోని అప్పన్నదొరపాలెం తోటల్లో గుర్తుతెలియని వివాహిత హత్యకు గురైంది. అయితే మృతురాలిని నాతవరం మండలం చెర్లోపాలెనికి చెందిన బంగారు చక్రంగా గుర్తించారు. బంగారు చక్రంతో వివాహేతర సంబంధం నడుపుతున్న ఆటో డ్రైవర్ పంపరబోయిన శ్రీనివాసరావునే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు మీడియా ఎదుట ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు.

నాలుగేళ్ళుగా ప్రేమలో ఉన్నాం, దేనికైనా సిద్దమే: జ్యోతి మృతిపై సందీప్ ఏమన్నాడంటే?

ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం

ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం

నాతవరం మండలం చెర్లోపాలేనికి చెందిన బంగారు చక్రం అనే వివాహితకు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ పంపరబోయిన శ్రీనివాసరావుకు ఏడాది క్రితం పరిచయమైంది ఆటోలో ప్రయాణం చేస్తున్నసమయంలో ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజులు గడుస్తున్నా కొద్దీ వీరిద్దరి మధ్య చనువు కూడ పెరిగింది. దీంతో ఆ వివాహిత అవసరాలను శ్రీనివాసరావు తీర్చడం మొదలు పెట్టారు. అవసరానికి డబ్బులు ఇతరత్రా వస్తువులను సమకూర్చేవాడు.

ఇతరులతో సంబంధాలున్నాయని అనుమానం

ఇతరులతో సంబంధాలున్నాయని అనుమానం

ఇటీవల కాలంలో ఆ వివాహితకు ఇతరులతో కూడ సంబంధాలున్నాయని శ్రీనివాసరావు అనుమానించాడు. ఇతరుల ద్విచక్రవాహనాలపై వెళ్ళడాన్ని శ్రీనివాసరావు గమనించాడు అంతేకాదు పదే పదే గంటల తరబడి ఫోన్లు మాట్లాడడం వంటి అంశాలను గమనించి ఆ వివాహితపై శ్రీనివాసరావు అనుమానం పెంచుకొన్నాడు. ఆమె అవసరాలు తీర్చడమే కాకుండా డబ్బులు కూడ సర్ధుతున్నా ఆమె నిర్లక్ష్యంగా ఉందనే అనుమానపడ్డాడు దీంతో ఈ విషయమై తేల్చుకోవాలని శ్రీనివాసరావు భావించాడు.

ఫోన్ చేసి పిలిచాడు

ఫోన్ చేసి పిలిచాడు

ఏప్రిల్ 13 ఉదయం ఆమెను తునికి రమ్మని పిలిపించాడు. ఇద్దరూ కలిసి టూవీలర్‌ మీద అనకాపల్లికి వచ్చారు. అక్కడ పని చూసుకొని తిరిగి వెళ్ళే సమయంలో పెట్రోల్ కోసం బంక్ వద్ద ఆగిన సమయంలో బంగారు చక్రం ఫోన్‌లో మాట్లాడింది. ఆ సమయంలో శ్రీనివాసరావు బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నాడు. అయితే వివాహిత ఫోన్‌లో మాట్లాడడాన్ని గుర్తించిన శ్రీనివాసరావు ఈ విషయమై ఆమెను ప్రశ్నించాడు. కానీ ఆమె ఎవరితో మాట్లాడిందనే విషయాన్ని చెప్పలేదు. పైగా తాను ఎవరితో మాట్లాడిందో ఆ ఫోన్‌ నెంబర్‌ను కాల్ డేటా నుండి డిలీట్ చేసింది దీంతో శ్రీనివాసరావుకు బంగారు చక్రంపై కోపం ఎక్కువైపోయింది. చక్రాన్ని చంపాలని ప్లాన్ చేశారు. వెంటనే అక్కడే ఓ కత్తి కొనుగోలు చేశాడు.

తోటలోకి తీసుకెళ్ళి

తోటలోకి తీసుకెళ్ళి

అనకాపల్లి నుండి తిరిగి వస్తూ మార్గమధ్యంలోని అప్పన్నదొరపాలెం తోటల్లోకి శ్రీనివాసరావు, బంగారు చక్రం వెళ్ళారు. ఇద్దరూ కూడ మార్గమధ్యలో ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయమై గొడవకు దిగారు. తోటలోకి కోరిక తీర్చుకొనేందుకు చక్రాన్ని తీసుకెళ్ళారు పడుకొనేందుకు వీలుగా చెట్ల కొమ్మలను నరికి తెచ్చాడు. బంగారు చక్రం చెట్ల కొమ్మలను నేలపై పరుస్తుండగా వెనుక నుండి వచ్చిన శ్రీనివాసరావు ఆమెపై కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు.అయితే మృతురాలి ఫోన్‌కు వచ్చిన పోన్ల ఆధారంగా ఈ కేసును చేధించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bangaru chakram , 30 year old lady killed for illegal affair in Vishakapatnam district on April 13. Srinivasarao killed Bangaru chakram for extramarital affair.He continues extra marital affair with Chakram last one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more