మహిళలపై లైంగిక వేధింపులు: రహస్యంగా వీడియోలు తీసి స్నేహితులకు
విశాఖ: తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను లోబర్చుకొని మహిళలతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగు చూసింది.
మహిళలపై లైంగిక వేధింపులు,దాడులు చోటు చేసుకొంటున్న ఘటనలు ప్రతి రోజూ చూస్తున్నాం, ఈ తరహా వార్తలు వింటున్నాం.
అయితే ఇదే తరహ ఘటన ఒకటి ఏపీ రాష్ట్రంలోని విశాఖ పట్టణంలో చోటు చేసుకొంది. ఉపాధి కోసం ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులపై ఓ కామాంధుడు పాల్పడిన వికృత క్రీడకు ఎట్టకేలకు తెరపడింది.

మహిళా ఉద్యోగులపై వికృత క్రీడ
మహిళా ఉద్యోగులను లోబర్చుకొని ఏపీలోని విశాఖలోని ఓ ప్రైవేట్ సంస్థ యజమాని శ్రీనివాస్ పాల్పడ్డాడని అందులో పనిచేసే బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులను లోబర్చుకొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలను
ఏకాంతంగా మహిళలతో గడిపిన ఫోటోలు, వీడియోలను ఆ ప్రైవేట్ సంస్థకు చెందిన యజమాని రహస్యంగా చిత్రీకరించారు. ఏకాంతంగా తాను తన సంస్థలో పనిచేసే ఉద్యోగినులతో గడిపిన దృశ్యాలను ల్యాప్‌ట్యాప్‌లో భద్రపర్చారు. అంతేకాదు ఈ ఫోటోలను తన స్నేహితులకు పంపేవాడు.

బాధితురాలి భర్తకు ఫోటోలు
ఈ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో సంస్థ యజమాని ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగు చూడడంతో బాధితురాలి భర్త కంటపడ్డాయి. దీంతో ఈ సంస్థలో చోటు చేసుకొంటున్న వికృత క్రీడ బయటకు వచ్చింది. ఈ విషయమై బాధితులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శిక్షణ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు
విశాఖలోని ఈ సంస్థలో మహిళలకు పలు విషయాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే శిక్షణ పేరుతో ఆ సంస్థ యజమాని సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగినులను లోబర్చుకొనేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు.ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications