శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ.. ఇరు రాష్ట్రాల మంత్రుల పూజలు.. 4 గేట్లు ఎత్తి..! (వీడియో)
శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దాంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ సీజన్‌లో గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడంతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణమ్మకు ప్రత్యేక పూజల తరువాత ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందకు కదిలింది. నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతూ కనువిందు చేసింది. ఈ అద్భుత ఘట్టం వీక్షించి సందర్శకులు తన్మయత్వం చెందారు. అయితే నాలుగు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

నాలుగు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు కిందకు విడుదల చేయగా.. ఒక్కో గేటు నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదట 6వ నెంబర్ గేటు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం వరుసగా 7,8,9 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం అది 880 అడుగులకు చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి కాస్తా ముందుగానే జలాశయం నిండిందని అధికారులు తెలిపారు. అదలావుంటే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 189.89 టీఎంసీల నీరు నిల్వ అయింది. ఆ నేపథ్యంలోనే నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications