శ్రీశైలం ఖాళీ - పోటాపోటీగా విద్యుదుత్పత్తి : సాగు- తాగు నీటికి ఇబ్బందులే..!!

శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. దాదాపుగా డెడ్ స్టోరేజ్ కు చేరింది. నీటి నిల్వలు అడుగుంటిపోయాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సూచనలను రెండు రాష్ట్రాలు పక్కన పెట్టేసి.. పోటాపోటీగా తెలుగు రాష్ట్రాల జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయ. దీంతో..రానున్న రోజుల్లో తాగు - సాగు నీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. 215 టీఎంసీల సామర్థ్యానికిగాను.. 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు పడి పోయాయి. తాగు, సాగునీటి అవసరాలున్నప్పుడు మాత్రమే జలవిద్యుత్తును ఉత్పత్తి చేయండనే ఆదేశాలను రెండు రాస్ట్రాలు పక్కన పెట్టేశాయి. దీని ఫలితంగా ఈ దుస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది.

ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్తులో శ్రీశైలం వాటానే చెరో 40శాతంగా ఉండడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఐదు నెలల క్రితమే కేఆర్‌ఎంబీ లేఖలుఈ పరిస్థితులను ముందే ఊహించి, ఐదు నెలల క్రితమే ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేఆర్‌ఎంబీ లేఖలు రాసింది. సాగు, తాగునీటి అవ సరాలు లేకుండానే శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడంతో విలువైన నీరు సముద్రంలో కలుస్తోందని... రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వాటర్‌ ఇయర్‌లో ఇప్పటిదాకా కేవలం ఐదు నెలలు మాత్రమే పూర్తయ్యాయని కేఆర్‌ఎంబీ సూచిస్తూ లేఖ రాసింది. ఆ సమయంలో శ్రీశైలంలో 856.10 అడుగుల దాకా నీటిమట్టంతో 94.91 టీఎంసీల నిల్వలు ఉండేవి.

Srisailam project is in dead storage level, It may lead to problem for drinking and irrigation in coming days

తాజాగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు(812.14 అడుగులు) పడిపోయాయి. అయితే, వీటిని ప్రభుత్వాలు బేఖాతరు చేసాయి. తాగునీటి అవసరాలు తీర్చుతూ... ఆ నీటితో మాత్రమే శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని 2018 అక్టోబరు 16, 2020 జూన్‌ 4 తేదీల్లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిబంధనను రెండు రాష్ట్రాలూ బేఖాతరు చేస్తున్నాయి.

వాటర్‌ ఇయర్‌లో 8 నెలలు మాత్రమే పూర్తయ్యాయి. మరో నాలుగు నెలలు మిగిలే ఉన్నాయి. కానీ... అప్పుడే శ్రీశైలం ఖాళీ అయిపోయింది. దీంతో.. రానున్న రోజుల్లో నీటి నిర్వహణ రెండు రాష్ట్రాలకు ప్రధానంగా ఏపీకి సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి..ఇప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా వీటి నిర్వహణ దిశగా ఆలోచన.. ప్రణాళికలు చేస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+