శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - భక్తులకు కీలక సూచనలు..!!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శ్రీశైలంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా -ఆలయ అధికారులు ఏర్పాట్ల పైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దీంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు కీలక సూచనలు చేసారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు రోజుకు లక్ష పదివేల మంది చొప్పున పది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం సులభంగా దర్శించుకునేందుకు నాలుగు రకాల ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు వెల్లడించారు. మార్చి 1వ తేదీన శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు. 3న శ్రీదుర్గామల్లేశ్వరి దేవస్థానం 4న కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, టిడిపి దేవస్థానం, 5 న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు.

ఇక, 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం ప్రభోత్సవం నిర్వహించి, రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9వ తేదీ సాయంత్రం రధోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నామని ఈవో పెద్దిరాజు వివరించారు. ఏపీ నుంచి 500 బస్సులు, తెలంగాణా నుంచి 450 బస్సులను, కర్ణాటక నుంచి 170 ఏర్పాటు చేస్తామన్నారు .ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్డుకు ప్యాచింగ్, మరమ్మత్తు పనులు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భారీ వాహనాలను అటవీ మార్గంలో అనుమతించకుండా డ్రైవర్డ్ చేసేవిధంగా నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications