Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం, ప్రత్యేకంగా - నేటి నుంచే..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ రోజు నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. అటు ఒంటిమిట్టలో ఈ నెల 11న సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కల్యాణం కు వచ్చే ప్రతీ భక్తుకుడికి కల్యాణ తలంబ్రాలతో పాటుగా శ్రీవారి లడ్డూ.. అన్న ప్రసాదం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

భక్తులకు దర్శనం
తిరుమలలో ఈ రోజు నుంచి వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయం వెనుక వైపున వున్న వసంతమండపంలో వసంతోత్సవాలను అర్చకులు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢ వీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రేపు (శుక్రవారం) భూ సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

Srivari Laddu Prasadam to the devotees who attend the Vontimitta Sri Sita Rama Kalyanam

వసంతోత్సవం
మూడో రోజు (చివరిరోజు) శనివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఈరోజు తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు.

Take a Poll

తలంబ్రాలు - లడ్డూ ప్రసాదం
కాగా ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ అధికారులు రద్దు చేసారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణం ఏర్పాట్లను టిటిడి అధికారులు పరిశీలించారు. ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ - 2లో బుధవారం శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహిం చారు. మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+