TTD: తిరుమలలో ధ్వజారోహణంతో సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమలలో ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అయ్యాయి. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు.

Srivari Salakatla Brahmotsavam begins with flag hoisting in Tirumala

సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీ‌శ్రీ‌ చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Srivari Salakatla Brahmotsavam begins with flag hoisting in Tirumala

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేశారు. గత సంవత్సరంలో తిరుమలలో జరిగిన శ్రీవారి రెండు బ్రహ్మోత్సవాలకు కలిపి 11 లక్షల మందికిపైగా భక్తలు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

గత ఏడాది రెండు బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు రూ 57,63,360 హుండీ రూపంలో కానుకలు సమర్పించుకున్నారు. రెండు బ్రహ్మోత్సవాలకు కలిపి 57,63,360 లడ్డూలు విక్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సుమారు 7 లక్షల మందికిపైగా భక్తులు తిరుమల వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. గురుడసేవ రోజు మాత్రమే తిరుమలకు రెండు లక్షల మందికి పైగా శ్రీవారి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్లుగానే గరుడసేవ రోజు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+