మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో హీరోయిన్ల ఖరారు?
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. భారతదేశ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు రూ.1500 కోట్ల నుంచి రూ.1800 కోట్ల మధ్యలో ఖర్చు చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తారు.
ఈ సినిమాలో లుక్ కోసం మహేష్ బాబు కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. జిమ్ లో కష్టపడుతున్న ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందని, ఆ ముగ్గురిని బాలీవుడ్ నుంచి ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. రాజమౌళి దీనికోసం ప్రత్యేకంగా ఒక వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా హీరోయిన్లను ఖరారు చేస్తారు.

2024లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. కొన్ని హాలీవుడ్ సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ అడ్వంచర్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ యాత్రికుడిగా మహేష్ బాబు కనిపించనున్నారు. ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications