చంద్రబాబుకు షాక్, కుప్పంలో ఇంత జరిగిందా ?, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ బాలికల హాస్టల్లో వేధింపులు ఎక్కువ అయ్యాయి అని వెలుగు చూడడం కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని బాలికల హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో బాలికల హాస్టల్ లో వేధింపులు ఎక్కువ అయ్యాయని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ వసతి గృహాల్లో చేరిన బాలికలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోసారి వెలుగు చూసింది.

చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం గరిగచేనేపల్లెలో నివాసం ఉండే దంపతులు బతుకు తెరువు కోసం బెంగళూరులో కూలి పని చేసుకుంటున్నారు. చదువుకోవాలని ఆశతో ఈ దంపతుల కుమార్తె శాంతిపురం మండలంలోని రాళ్లబూదుగూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. ఇదే ఏడాది జూన్ 19వ తేదీన అమ్మాయి ఆ హాస్టల్ లో చేరింది. హాస్టల్లో ఉంటన్న ఆ అమ్మాయిపట్ల అదే హాస్టల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి.
హాస్టల్ సిబ్బంది తనను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ అమ్మాయి ఈనెల 9వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. సాంఘిక సంక్షేమ హాస్టల్ కు సంబంధించిన వివరాలు మీ కుటుంబ సభ్యులకు గానీ, పై అధికారులు దాని చెబితే నీ కథ చూస్తామని హాస్టల్ సిబ్బంది బెదిరిస్తున్నారని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులు ఎక్కువ అయ్యాయని ఆ బాలిక ఆరోపించింది.
చివరికి ఆ అమ్మాయి ఆమె తల్లితో కలిసి మీడియా ముందుకు వచ్చింది. మీడియాతో మాట్లాడిన బాలిక సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఇబ్బందులు ఎక్కువ అయ్యాయని, తనతో పాటు పది మంది అమ్మాయిలు టీసీలు తీసుకుని బయటకు వెళ్ళిపోయామని, ఇంత జరిగినా కూడా పై అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని బాలిక ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడికి సామాచారం అందించారని తెలిసింది. తన సొంత నియోజక వర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో ఇలాంటి ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని, ఆ హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications