ఇంద్రకీలాద్రి లడ్డూ కౌంటర్ వద్ద ఫోన్లో 'బ్రహ్మోత్సవం' పాట, విమర్శలు
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ లడ్డూ కౌంటర్‌లో సిబ్బంది సినిమా పాటలు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ప్రతి పెద్ద దేవాలయాలలో ప్రత్యేకంగా లడ్డూ, పులిహోర కౌంటర్లు ఉంటాయి. భక్తులు కొనుక్కునేందుకు ఇవి అందుబాటాలో ఉంటాయి.
ఈ కౌంటర్లలో సిబ్బంది పని చేస్తుంటారు. బెజవాడలోను భక్తులకు అందుబాటులో ఉన్న ఓ ప్రసాదం కౌంటర్ వద్ద సిబ్బంది సినిమా పాటలు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వద్ద సెల్ ఫోన్లలో సినిమా పాటలు చూడటం ఏమిటని పలువురు మండిపడుతున్నారు.

ఇంద్రకీలాద్రి పైకి సెల్ ఫోన్లను నిషేధించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సదరు ప్రసాదం కౌంటర్ వద్ద గల ఉన్న వ్యక్తి శ్రీమంతుడు సినిమాలోని ఓ పాటను చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలా చేయడం అపచారమని విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications