పవన్ కళ్యాణ్ పై స్టార్ సింగర్ ఎస్పీ శైలజ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన రగడ నేటికీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం హైందవ సమాజంలో ఆగ్రహానికి కారణం అవుతున్న వేళ హిందూ ధర్మం కోసం, తిరుమల దేవదేవుడి అపచారానికి పరిహారంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించిన సింగర్ ఎస్పీ శైలజ
ఇక ఈ క్రమంలో సనాతన ధర్మం కోసం తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి తన సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష వేళ ఏపీ రాజకీయ పరిణామాలపైన ఎప్పుడూ స్పందించని ప్రముఖ స్టార్ సింగర్ ఎస్పీ శైలజ స్పందించారు.

పవన్ సనాతన ధర్మ మార్గంపై శైలజ వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఆమె తనదైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో పవన్ కళ్యాణ్ చేస్తుంది తప్పా.. రైటా... మీరేమంటారు అని ఒక మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎవరి ధర్మం వారికి ముఖ్యం. ఆయన చేస్తుంది తన ధర్మం అనుకొని చేస్తున్నారు కాబట్టి దానిపైన మధ్యలో వేలెత్తి చూపించాల్సిన అవసరం ఎవరికీ లేదని ఎస్పీ శైలజ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కు మద్దతు తెలపాల్సిన అవసరం లేదు
అలా చేస్తే స్వామికి జరిగిన అపచారానికి పరిహారం జరుగుతుందని భావిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, ఆయన నమ్ముతుంది చేయడంలో తప్పేమీ లేదని ఎస్పీ శైలజ అన్నారు. ఇలాంటి విషయాలలో చేతనైతే సహాయం చేయాలి లేకపోతే సైలెంట్ గా చూడాలి తప్ప ప్రతిదీ వివాదం చేయకూడదని ఆమె స్పందించారు. మనం ఎవ్వరం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపాల్సిన అవసరం లేదన్నారు.
మనం వెనక ఉండి పవన్ గురించి మాట్లాడాల్సిన పనిలేదు
ఆయనలో భగవంతుడి పైన ఉన్న భక్తి ఆయనను ముందుకు నడిపిస్తాయని, మనం వెనకాల ఉండి మాట్లాడాల్సిన పని ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు చెయ్యగలిగితే సహాయం చేయాలి కానీ వేలెత్తి చూపించి మాట్లాడకూడదని పేర్కొన్నారు. ఈ సమయంలో భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చెప్పిన ఎస్పీ శైలజ తన అభిప్రాయాన్ని తెలిపారు.
Singer S.P.Sailaja Garu about @PawanKalyan & #SanatanaDharma 🙏 pic.twitter.com/mnts2Zv6GP
— Kalyan Babu™ (@ram_aduri) September 26, 2024
పర ధర్మంలోకి వెళ్లి ఇబ్బందులు పడకూడదు
"స్వధర్మే నిధనం శ్రేయం పర ధర్మో భయావహః" అంటూ స్వధర్మాన్నినే పాటించాలని, పర ధర్మంలోకి వెళ్లి ఇబ్బందులు పడకూడదని భగవద్గీతలో చెప్పారన్నారు పవన్ కళ్యాణ్ కూడా తన ధర్మాన్ని తాను పాటించడంలో తప్పు లేదని శైలజ పవన్ కళ్యాణ్ కు మద్దతునిచ్చారు.












Click it and Unblock the Notifications