స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ - ఏ ఎన్నిక ఎప్పుడంటే, ఇలా వరుసగా..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఏపీ కేబినెట్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసు మేరకు బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికార నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటు ఎన్నికల సంఘం ముందుగా మున్సిపల్.. ఆ తరువాత జెడ్పీ పోరు కోసం షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు చేస్తోంది. ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో, దసరా వేళ రాష్ట్రంలో ఎన్నికల సమరం ఆరంభం కానుంది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఫిక్స్ అయింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేష న్లు నిర్ధారించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ చేసిన సిఫారసులను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామాల్లో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్ వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్ల వరకూ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. మరోవైపు ఈ నెల 13న రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశమై స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. ఈ భేటీ అనంతరం 14న మున్సిపల్, 19న ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్‌తో పాటు షెడ్యూల్‌ను విడుదలకు రంగం సిద్దమైంది. నవంబరులో ద్వితీయార్ధంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

వరుసగా ఎన్నికల నోటిఫికేషన్లు
ఇటు ఎన్నికల సంఘం పూర్తి సమాయత్తం అయింది. 13న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన అనంతరం 14న మున్సిపల్ ఎన్నికలకు, 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ నెలాఖరు నాటికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. అలాగే నవంబరు 10 నుంచి 15వ తేదీ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల కానుంది. పంచాయతీలకు మూడు రోజుల వ్యవధిలో మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎస్‌ఈసీ నిర్ణయించింది. నవంబరు చివరి నాటికి మొత్తం పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. దీంతో.. దసరా వేళ రాష్ట్రంలో ఎన్నికల సమరం హోరా హోరీగా కొనసాగనుంది.













Click it and Unblock the Notifications
