స్థానిక ఎన్నికల షెడ్యూల్: ఎప్పుడు ఏ ఎలక్షన్ - రిజర్వేషన్లు ఇలా..నేడే..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు సర్వం సిద్దం అయింది. ఈ రోజు ఎన్నికల నిర్వహణ దిశగా కీలక పరిణామాలు.. నిర్ణయాలు వెలువడనున్నాయి. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం నిర్ణయం వెలువడటం తో ఏపీ ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు జీవోలు జారీ కానున్నాయి. ఇక.. రిజర్వేషన్ల పైనా నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు సిద్దం అవుతోంది.

స్థానిక ఎన్నికల పైన ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఏపీ మంత్రివర్గం ఈ రోజు అత్యవసరంగా సమావేశం కానుంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసుల మేరకే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు సమాయత్తమైంది. సుప్రీం బీసీలకు రిజర్వేషన్ల అమలు పైన నిర్ణయం స్పష్టం చేయటంతో.. ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ల అమలుకు ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటుంది. ఆ వెంటనే పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు వేర్వేరుగా రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీచేస్తాయి. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తర్వులు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అటు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, వార్డులు.. ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఆ తర్వాతే ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేస్తుంది.

స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వం ఊహించని నిర్ణయం..!!
స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వం ఊహించని నిర్ణయం..!!
state-election-commission-all-set-to-announce-schedule-for-local-body-elections-after-govt-decision

మూడు దశల్లో స్థానిక ఎన్నికలు

ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. అన్నీ కుదిరితే సోమవారమే షెడ్యూలు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. గతంలో మున్సిపల్‌ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా జరిపారు. అయితే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా, పంచాయతీలకు మూడు విడతల్లో నిర్వహించాలని అధికారుల నుంచి అభ్యర్థనలు వెలువడ్డాయి. దీనిపై ఇంకా నిర్ణయానికి రాలేదు. గతంలో మాదిరిగానే మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే దశ లో నిర్వహించనున్నారు. గ్రామ పంచాయితీలకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ప్రక్రియకు 16 రోజుల గడువును కేటాయించారు. 12వ తేదీ షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ భేటీ తరువాత పూర్తి స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+