'జగన్‌కు, బాబుకు తేడా అదే', పవన్ కళ్యాణ్‌పై రోజా ప్రశ్నల వర్షం (పిక్చర్స్)
విజయవాడ: రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు.
తాము అధికారంలోకి వస్తే మీ భూములు మీకిస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అందుకే కేసులకు భయపడి ప్రధాని మోడీకి సాష్టాంగ పడుతున్నారన్నారు. స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అంటున్నారన్నారు. తన పైన కేసులు ఉన్నా తాను భయపడలేదని, చంద్రబాబు మాత్రం కేసులకు భయపడుతున్నారని, చంద్రబాబుకు, జగన్‌కు తేడా అదేనని జగన్ వ్యాఖ్యానించారు. హోదా కోసం 29న జరిగే బందును అందరు విజయవంతం చేయాలన్నారు.

జగన్ దీక్ష
ఎంతో పరిపాలనా అనుభవజ్ఞుడనే ప్రచారంతో తిరిగి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ముచ్చటగా మోసం... మోసం... మోసం అనే మూడు పదాలతో సాగుతోందని జగన్ నిప్పులు చెరిగారు. అదిరించి బెదిరించి ఇప్పటికే 33,500 ఎకరాలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం, మరో 2,500 ఎకరాల కోసం దశలవారీగా భూసేకరణ చట్టానికి శ్రీకారం చుట్టటాన్ని జగన్ వ్యతిరేకించారు.

జగన్ దీక్ష
సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన భారీ ధర్నాలో జగన్ ఉద్వేగంతో ప్రసంగించారు. సభకు పార్టీ పశ్చిమ కృష్ణా అధ్యక్షులు మాజీ మంత్రి కె పార్థసారథి అధ్యక్షత వహించారు.

జగన్ దీక్ష
అధికారం ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండబోదన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నారు. అసలు ఎన్నికల హామీలు ఓవిధంగా ఉంటే ప్రస్తుతం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తునందున ఈ ప్రభుత్వం ఎంతోకాలం అధికారంలో ఉండబోదన్నారు. ఏడాది రెండేళ్లలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, పార్టీని బంగాళఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు.

జగన్ దీక్ష
వచ్చేది తమ ప్రభుత్వమేనని, వెను వెంటనే టిడిపి సర్కారు బలవంతంగా లాక్కొన్న భూములన్నింటినీ సంబంధిత రైతులకు వెనక్కి ఇచ్చేస్తామన్నారు.

జగన్ దీక్ష
రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాను కోరుతుంటే చంద్రబాబు మాత్రం ఓటు నోటు కేసు నుంచి ఏదోక విధంగా బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లపై సాష్టాంగ పడుతున్నారన్నారు.

జగన్ దీక్ష
తన పైనా ఎన్నో కేసులు బనాయంచారని, తాను ఏనాడైనా సోనియా గాంధీ కాళ్లపై పడ్డానా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే తనను చంద్రబాబు కాదు కదా, ఆయన తండ్రి పైనుంచి దిగివచ్చినా ఆపలేరంటూ నిప్పులు చెరిగారు.

జగన్ దీక్ష
రాజధాని నిర్మాణానికి వైకాపా వ్యతిరేకం కాదని, ఆయా రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా పంట భూములను చేజిక్కించుకుంటూ కార్పొరేట్ రాజధానిగా మార్చే ప్రయత్నాన్నే అడ్డుకుంటున్నామన్నారు. 70 శాతంపైగా పరిశ్రమలున్న హైదారాబాద్ వీడిపోతున్నందున ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలన్నారు.
అసలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలు లేకుండా కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్‌గా ఉంటాయన్నారు.

జగన్ దీక్ష
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. ప్రజల సమస్యల పైన కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారని, జగన్ స్పందించడం లేదని ఓ పత్రికలో వార్త వచ్చిందని, అది సరికాదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి, ఏపీని రోడ్డున పడేస్తే, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకు రాకుంటే ఎల్లో మీడియా మాట్లాడదన్నారు.

జగన్ దీక్ష
రిషికేశ్వరి మృతి పైన, ప్రత్యేక హోదా రాకుంటే కేంద్రం, టిడిపి ప్రభుత్వం పైన, వనజాక్షి పైన దాడి విషయమై, ప్రజల సమస్యల పైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications