నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ ల స్టాప్ ల ఎత్తివేత..!!

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే నాలుగు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపులను ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే నారాయణాద్రి, విశాఖ, చైన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించిన ఈ స్టాపుల మార్పు పైన అధికారులు తాజాగా నిర్ణయంచారు. ఈ నిర్ణయంతో ప్రయాణీకులకు కష్టాలు తప్పేలా లేవు. ఈ నెల 19వ తేది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా ఈ స్టేషన్లకు రిజర్వేషన్లను నిలుపుదల చేసారు.

నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్లలో స్టాప్ ఎత్తివేస్తూ రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు సమస్యగా మారనుంది. కొత్త కష్టాలు మొదలు కానున్నాయి. కరోనా సమయంలో రైల్వే బోర్డు అధికారులు నారాయణాద్రి, విశాఖ, చెన్నై రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీ చేసారు. అప్పటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే అధికారులతో మాట్లాడారు.

Stops changes for NArayanadrim Viskaha Chennai Express trains details here

నాడు ఉత్తమ్ రైల్వే అధికారులతో చర్చల ఫలితంగా ఏడాది పాటు రైళ్లను ఈ స్టేషన్లలో నిలిపేందుకు అధికారులు అంగీకరించారు. ఏడాది పాటు ఇచ్చిన సమయం ఈ నెల 19తో ముగియనుంది. దీంతో, ఆ రోజు నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్ ప్రెస్ లకు రైల్వే ఐఆర్సీటీసీ అధికారులు మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల స్టేషన్ లకు రిజర్వేషన్లు నిలిపివేసారు.

విశాఖ ఎక్స్ ప్రెస్ రైలుకు నల్గొండలో కూడా స్టాప్ ఎత్తివేసారు. తిరుపతి, చెన్నై, భువనేశ్వర్ కు వెళ్లే ఈ మూడు ప్రధాన రైళ్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. అయితే, తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+