విచిత్ర వివాహం:అబ్బాయికి 13...అమ్మాయికి 23 ఏళ్లు,నేరమైనా సరే!

కర్నూలు:బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో వీటిపై ఇంకా సరైన అవగాహన రాలేదనే సంఘటన చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఇటువంటిదే ఒక వింత వివాహం జరుగగా అది కాస్త ఆలస్యంగానైనా సరే సోషల్ మీడియా పుణ్యమాని వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా బాల్య వివాహాల్లో వధువుకు చిన్న వయస్సు...వరుడు ఆమె కంటే చాలా పెద్ద వయస్సుతో ఉండటం కద్దు. అయితే కర్నూలు జిల్లాలో జరిగిన ఈ విచిత్ర పెళ్లి మాత్రం అందుకు పూర్తి రివర్స్. ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు 10 సంవత్సరాలు పెద్ద కావడమే విశేషం. అంతేకాదు అసలు ఇలాంటి పెళ్లి చేయడం పెద్ద నేరం కూడా. అయినా మరి అవగాహన లేకో...లేక చట్టమేం చేస్తుందనుకున్నారో కానీ...ఇరువర్గాల పెద్దలు ఒక బాలుడిని చిన్నారి పెళ్లికొడుకుగా మార్చేశారు. వివరాల్లోకి వెళితే...

Strange marriage: Groom 13 ...Bride 23

కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలం కౌతాళం సమీపంలోని ఓ కుగ్రామంలో వారం క్రితం 13 ఏళ్ల బాలుడికి దాదాపు 23 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. ఇది మారుమూల ప్రాంతం కావడం అక్కడివారికి ఇలా పెళ్లి చేయడం నేరమనే అవగాహన లేకపోవడం వల్ల నిరాటంకంగా జరిగిపోయింది. అయితే ఈ పెళ్లికి హాజరైనవారు ఎవరో సెల్ ఫోన్ లో ఈ పెళ్లి తంతును చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తరువాత ఇది వైరల్ గా మారింది. తద్వారా ఈ బాల్య వివాహం విషయం వెలుగులోకి వచ్చింది.

భర్త మద్యానికి బానిస కావడం, తన ఆరోగ్యం దెబ్బ తినడంతో తాను చనిపోతే కుటుంబాన్ని పట్టించుకునేవారు ఎవరనే ఆందోళనతో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెల సంతానం కలిగిన ఒక తల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కొడుకుల్లో పెద్దవాడికి 13 ఏళ్లే అయినా వాడికి పెళ్లి చేస్తే వచ్చే కోడలు తన తదనంతరం కుటుంబాన్ని చూసుకుంటుందనే ఆలోచనతో ఆమె ఈ పెళ్లికి పట్టుబట్టినట్లు సమాచారం.

కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ఆమె తమ దూరపు బంధువుల్లోనే పెళ్లీడుకొచ్చిన ఒకమ్మాయిని చూసి ఏప్రిల్‌ 27న ఈ పెళ్లి జరిపించినట్లు తెలిసింది. దీంతో 13 ఏళ్ల వయస్సున్న బాలుడు తనకంటే సుమారు 10 సంవత్సరాలు పెద్దదైన యువతిని వివాహమాడాడు. దీంతో విషయం తెలీక ఈ పెళ్లికి వచ్చిన వారంతా షాక్ గురైనట్లు సమాచారం. కొందరైతే పెళ్లి పెద్దలను నిలువరించే ప్రయత్నం చేసినా వారే మాత్రం వెనక్కి తగ్గకుండా పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలిసింది. చివరకు ఈ వింత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఆలస్యంగానైనా విషయం బయటకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+