నిర్మానుష్యంగా కాకినాడ- తీరంలో రాకాసి అలలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకూ అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.

ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ బంగాళాఖాతం మచిలీపట్నానికి 190, కాకినాడకు 270, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ తీరం వైపు కదులుతోంది. ఈ రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్ చేరువ అవుతున్న కొద్దీ మహోగ్రంగా మారుతూ కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

Strong winds and heavy ocean waves lash Kakinada Beach as Cyclone Montha is expected to approach

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తీవ్రత మరో రేపు కూడా కొనసాగనుంది. నేటి నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తోన్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగనుంది.

కాపులుప్పాడలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 125 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. విశాఖ రూరల్- 120, ఆనందపురం- 117 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 86 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మొత్తం 233 మండలాల పరిధిలోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండబోతోందని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 పునరావాస శిబిరాలు ఏర్పాటయ్యాయి.

విశాఖపట్నంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ తీరాన్ని తాకుతుందని భావిస్తోన్న కాకినాడలో ఇదే పరిస్థితి నెలకొంది. సిటీ మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. బీచ్ లన్నీ బోసిపోయాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఇతర సిబ్బంది తప్ప సామన్యులెవరూ బీచ్ లో కనిపించట్లేదు. అక్కడికి వెళ్లే రోడ్లన్నింటినీ మూసివేశారు.

ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. తుఫాన్ తర్వాత యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టనున్నారు. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడానికి అవసరమైన సామాగ్రిని తయారుగా ఉంచుకున్నారు. తుఫాన్ సమీపిస్తోన్న నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లో ఆటోల్లో మైక్ ల ద్వారా అనౌన్స్ మెంట్లు వినిపిస్తోన్నారు. స్థానికులను ఇప్పటికే పునరావాస శిబిరాలకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+