సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య, అనంతలో ఘోరం
హైదరాబాద్/అనంతపురం: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్‌డి విద్యార్థి వెంకటేశ్వర్లు విషం తిని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తనకిు గైడ్‌ను కేటాయించక పోవడం వల్లనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తోటి విద్యార్థులు చెబుతున్నారు. వెంకటేశ్వర్లు గైడ్ ఇటీవల రిటైర్ అయ్యారు.
గైడ్ లేకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి చేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతను రసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వాసన రావడంతో పక్క గది విద్యార్థులు వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. గంటల్లోనే మృతి చెందాడు.

అనంతలో దారుణం
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎపి సెట్‌కు హాజరైన మహిళను ఓ దుండగుడు కత్తితో పొడిచి పరారయ్యాడు.
శవమై తేలిన విద్యార్థి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ హాస్టల్ విద్యార్థిని కాలువలో శవమై తేలింది. పాలకొల్లులో ఈ దారుణం జరిగింది. ప్రియాంక అనే బాలిక ఈ నెల 19వ తేది నుండి కనిపించడం లేదు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్ వార్డెన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రియాంక పదో తరగతి చదువుతోంది.
అరకేజీ బంగారం స్వాధీనం
గుంటూరు జిల్లా శావల్యాపూరం పోలీసు స్టేషన్ పరిధిలో రూ.25 విలువ చేసే అరకిలో బంగారం, 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శావల్యాపూరం పోలీసు స్టేషన్ పరిధిలో వేల్పూరు గ్రామానికి చెందిన రామకృష్ణ అనే దొంగతో పాటు మరో ముగ్గురు వీటిని చోరీ చేశారు.












Click it and Unblock the Notifications