ఆంధ్ర యూనివర్సిటీలో కలకలం: హాస్టల్‌లో విద్యార్ధి ఉరేసుకుని ఆత్మహత్య
అమరావతి: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్‌లో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ సమీపాన ఉన్న మమతా హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్‌లోని కిటికీకి ఉరేసుకుని న్యాయ విద్యార్థి యశస్వి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనాస్థలిలో యశస్వి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను వ్యసానాలకు బానిస అయినందున మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. మంగళవారం అర్థరాత్రి వరకూ గదిలో ఉన్న స్నేహితులు కరెంటు పోవడంతో హాస్టల్ మేడపైకి వెళ్లారు.
వారితో పాటు హాస్టల్ పైకి వెళ్లకుండా గదిలోనే ఉండిపోయిన యశస్వి తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. యశస్వి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట. విద్యార్ధి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రిస్తున్నవారిపై కిరాతకంగా దాడి చేసి చంపేశారు
కడప జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. కోనేటికాలనీలో ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వేటకొడవళ్లను తమ వెంట తెచ్చుకున్న దుండగులు ఓ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై దాడి చేశారు. కుటుంబంలోని వారు నిద్రిస్తుండగానే వారిపై దాడి చేసి గొంతుకోసి పారిపోయారు.
దుండగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications