హైద్రాబాద్‌లో మహిళ హత్య:ట్రిపుల్‌ ఐటి విద్యార్థి సూసైడ్

Student commits suicide in Basara Triple IT
హైదరాబాద్/అదిలాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు హత్య చేశారు. మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. జిల్లాలోని జాఫర్‌గూడలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని అధారాలు సేకరించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే మంటల్లో పూర్తిగా కాలిపోయిన మహిళను పోలీసులు గుర్తించలేకపోయారు. ఎటువంటి అధారాలు లభించకుండా చేసేందుకే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు.

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లాలో గల బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల భవనంపై నుంచి దూకి నాగరాజు అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తలకి తీవ్ర గాయం కావడంతో మృతుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా కనగల్ మండలం గౌరారానికి చెందిన నాగరాజు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. భవనం నాలుగో అంతస్తు నుండి దూకాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, కళాశాల ప్లేస్‌మెంట్లలో ఉద్యోగం రాని కారణంగా అసంతప్తికిలోనైన నాగరాజు ఈ ఘాతకానికి పాల్పడి వుంటాడని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+