బాలకృష్ణ లెజెండ్ పంక్షన్‌లో అపశ్రుతి: ఒకరి మృతి
కడప: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్' సినిమా విజయోత్సవం సందర్భంగా ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రదర్శన 275 రోజులు దాటుతున్న సందర్భంగా ఆదివారం కడప జిల్లా పర్యటనకు వస్తున్న బాలకృష్ణను చూసేందుకు ప్రొద్దుటూరు డ్రైవర్ కొట్టాలకు చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఆదివారం సాయంత్రం బయలుదేరారు.
వాహనం రాయల్ కౌంటీ రిసార్ట్స్ వద్దకు చేరుతుండగా జమ్మలమడుగు నుండి వస్తున్న పోలీసు వాహనం టైర్ పేలి అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వస్తున్న గంగాధర్ (10) అనే విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తరలించారు.
గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

టెంపోను ఢీకొన్న సవేరా
కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు పోగొట్టుకోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె గేటు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూరు జిల్లాకు చెందిన సునీల్‌సందాస్‌హజ్‌గుడే తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలేశుని మొక్కు తీర్చుకునేందుకు లాతూరు నుంచి తిరుమలకు సవేరా వాహనంలో బయలుదేరారు.
అయితే సుదీర్ఘ ప్రయాణం కావడం, మితిమీరిన వేగంతో అనంతయ్యగారిపల్లె గేటు సమీపంలోని చిన్నమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న తమిళనాడుకు చెందిన టెంపోను ఢీ కొంది. దీంతో లాతూరులోని పాన్‌గఢ్ ప్రభుత్వాసుపత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సురేఖసునీల్‌హస్‌గుడే (48) తల చిధ్రం కావడంతో అక్కడక్కడే మృతి చెందింది. సవేరాలో ప్రయాణిస్తున్న ఆటోమెబైల్ ఇంజనీర్ ప్రశాంత్, అనిల్‌కన్నా, సునీల్ సందాస్‌హజ్‌గుడే, పుష్పలక్ష్ముణ్‌గడ్కే, ప్రియాంక, లక్ష్ముణ్, శివాజీలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్సై చెన్నకేశవులు, ఏఎస్సై నరసయ్య కానిస్టేబుల్స్‌తో హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. మృతి చెందిన సురేఖ మృతదేహాన్ని రాజంపేటకు తరలించారు.












Click it and Unblock the Notifications