నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోరిక తీర్చాలంటూ వివాహితకు విద్యార్థి సంఘం నేత వేధింపులు...అరెస్ట్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరులో ఒక వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ విద్యార్థి సంఘం నేతను బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

తాను అడిగినప్పుడల్లా కోరిక తీర్చాలని, నాలుగు లక్షల రూపాయల డబ్బు వెంటనే ఇవ్వాలని విద్యార్థి సంఘం నేత బెదిరిస్తున్నాడని, లేనిపక్షంలో తాము కలసి ఉన్న ఫోటోలను బైటపెడతామని వేధిస్తున్నాడని ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...

నెల్లూరు బాలాజీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నివాసం ఉండే ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో బాలాజీనగర్‌కు చెందిన ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు యామాల మధుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వ్యాపారి భార్యతో మధు పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత ఆమెకు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు యామాల మధుకు మధ్య విభేదాలు తలెత్తాయి.

Student Leader arrest in Nellore for sexual abuse

దీంతో అప్పటి నుంచి యామాల మధు నిత్యం ఆమెకు ఫోన్‌ చేసి నా వద్ద నీ ఫొటోలు, వీడియోలు ఉన్నాయని తాను కోరిన విధంగా చేయకపోతే వాటిని అన్నింటినీ సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంతేకాదు తాను అడిగినప్పుడు కోరిక తీర్చేందుకు రావాలని బెదిరించేవాడని చెప్పింది. తాజాగా తనకు తనకు అర్జంటుగా రూ.4 లక్షలు నగదు కావాలని, లేకపోతే ఫోటోలు, వీడియోలు బైటపెడతానని బెదిరించినట్లు తెలిపింది.

దీంతో విసిగిపోయిన ఆ మహిళ బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ భాస్కరయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మధును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి రిమాండ్‌ విధించింది.

English summary
A student organization leader arrested for sexually abusing a married woman in Nellore has been arrested by police on her complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X