షాక్: అర్థరాత్రి యువతితో పట్టుబడిన విద్యార్థి నేత

ఓ లాడ్జిలో ఓ యువతితో విద్యార్థి సంఘం నేత పట్టుబడడం కలకలం రేపింది. అతనితో పాటు మరో ఇద్దరు యువతితో అర్థరాత్రి పట్టుబడ్డారు.

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓ లాడ్జిలో ఒక యువతితో బీసీ విద్యార్థి సంఘ నాయకుడితోపాటు మరో ఇద్దరు సోమవారం అర్ధరాత్రి పట్టుబడ్డాడు. తెలిసిన సమాచారం మేరకు - స్థానిక కోటిపల్లి బస్టాండు వద్ద లాడ్జిలో తనిఖీలు చేయగా ఒక గదిలో యువతితోపాటు విద్యార్థి సంఘ నాయకుడు లద్దిక మల్లేష్‌, వి.ప్రవీణ్‌, పి.వినయ్‌ అనే వ్యక్తులు ఉన్నారు.

వారిని పోలీససులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అడ్డతీగల సమీప గ్రామానికి చెందిన ఆ యువతి భర్తతో గొడవపడి రాజమహేంద్రవరం వచ్చినట్టు తెలుస్తోంది. నగరంలో తన అక్క ఉన్నట్టు ఆ యువతి చెబుతోంది. తనకు విద్యార్థి సంఘ నాయకులు పరిచయమని చెబుతుంది.

Student leader caught in a lodge with girl

తన సమస్యను తమకు చెప్పుకునేందుకు వచ్చిందని, ఆమెకు లాడ్జిలో ఆశ్రయం కల్పించామని పట్టుబడిన నిందితులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్టు సీఐ రవికుమార్‌ తెలిపారు. కాగా, విషయం తెలిసి బీసీ సంఘం, భారతీయ మజ్ధూర్‌సంఘ్‌ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి దుర్గాయాదవ్‌ మంగళవారం పోలీసుస్టేషన్‌కు చేరుకుని సంఘటనపై వివరాలు సేకరించారు.

విద్యార్థి సంఘ నాయకులని చెప్పుకుంటూ రాజకీయ పలుకుబడితో విద్యార్థినులను ప్రలోభాలకు గురిచేయడం సరికాదనే అభిప్రాయపడుతున్నారు. లద్దిక మల్లేష్‌ను బీసీ సంఘం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విషయాన్ని బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య దృష్టికి తీసుకెళతామని దుర్గాయాదవ్‌ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+