కలుషితాహారం తిని విద్యార్థులు మృతి..జగన్ యాక్షన్, చంద్రబాబు రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కలుషితాహారం తినడం వల్ల నలుగురు విద్యార్థులు మరణించారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు చికిత్స తీసుకుంటూ మరణించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్‌లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కలుషితాహారం తిని విద్యార్థులు మరణించడంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Students died after eating contaminated food

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు లేదా సంరక్షకులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+