కాలేజీలో దారుణం: పోర్న్ మూవీలు చూపించి, అలా చేయమంటున్నారు!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లోని ఓ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో జూనియర్ విద్యార్థులు సీనియర్ల పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు తమకు బలవంతంగా శృంగార వీడియోలు చూపిస్తున్నారని బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, పోర్నోగ్రఫీ చూపించి, అందులోని చర్యలను అనుకరించాలని సీనియర్లు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు శనివారం నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో వెలుగు చూసింది.
ఈ ఫిర్యాదు గురించి హెల్ప్ లైన్ ఇనిస్టిట్యూట్‌కు సమాచారం అందింది. ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. బిటెక్ సెకండియర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు, మూడో సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థి పేరును వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ అయిదుగురు కూడా ఏపీకి చెందినవారేనని తెలుస్తోంది. సీనియర్లు తమ హాస్టర్ గదులకు మమ్మల్ని పిలిపించుకొని బలవంతంగా మాకు పోర్న్ సినిమాలు చూపిస్తున్నారని, ఆ తర్వాత అందులో చేసినట్లు చేసి చూపించాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో జూనియర్లు పేర్కొన్నారు.
గత కొద్ది నెలలుగా వారు తమను ఈ విధంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీనియర్ల తీరుతో జూనియర్లు చాలా డిస్టర్బ్ అవుతున్నారని అంటున్నారు. గతంలోను ర్యాగింగ్ విషయమై ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. ఈ ఫిర్యాదు మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వారు చేశారు. కాగా, దీనిపై కాలేజీ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిందని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications